Hyderabad: మండే ఎండల దాటికి కాలి బూడిదైన బైక్…

Updated on: Apr 07, 2025 | 3:53 PM

సోమవారం మధ్యాహ్నం కూకట్‌పల్లి వై జంక్షన్ సమీపంలో ఒక ద్విచక్ర వాహనం దగ్ధం కావడంతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. పెరిగిన ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఈ అగ్నిప్రమాదం సంభవించిందని భావిస్తున్నారు. నగరంలో ఎండ తీవ్రతకు ఈ ఘటన అద్దం పడుతోంది. వీడియో చూడండి...

హైదరాబాద్ నగరంలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9 దాటితే బయటకు వచ్చే పరిస్థితి లేదు. సూర్యుడు తన విశ్వరూపం చూపిస్తున్నాడు. మధ్యాహ్నం వేళల్లో బయటకు వెళ్తే.. నిప్పుతో నేషనల్ గేమ్ ఆడినట్లే.  సోమవారం ఉదయం 11:30 గంటల సమయానికే 34 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలిసింది. నగరంలో ఎండ తీవత్ర ఏ మాదిరిగా ఉందో వివరించే ఘటన జగద్గిరి గుట్టలో చోటు చేసుకుంది. ఓ షాపు ముందు నిలిపి ఉంచిన బైక్ ఎండ తీవ్రతకు నిట్టనిలువునా కాలి బూడిదైంది. బైక్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.. ఏమైందో తెలుసుకునేలోపే కాలి బూడిదైంది. దీంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఫైర్ ఫైటర్స్ వెంటనే అక్కడకు చేరుకొని మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ఎవరికీ గాయాలు అవ్వలేదు. గత వారం రోజులుగా హైదరాబాద్‌లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి, కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 44 డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.  

 

Published on: Apr 07, 2025 03:50 PM