CII Summit 2025: విశాఖలో కొనసాగుతున్న సీఐఐ సమ్మిట్‌.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..

Updated on: Nov 15, 2025 | 11:36 AM

విశాఖలో రెండో రోజు సీఐఐ సమ్మిట్‌ కొనసాగుతోంది. రేమండ్‌కు సంబంధించిన ప్రాజెక్టులకు సీఎం చంద్రబాబు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ఏపీలో రేమండ్‌ గ్రూప్‌ 1200 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనుంది. రాష్ట్రంలో మూడు ప్రాజెక్టులు ఏర్పాటు ద్వారా 6 వేల 500 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు కల్పించనుంది రేమండ్‌ సంస్థ.

విశాఖలో రెండో రోజు సీఐఐ సమ్మిట్‌ కొనసాగుతోంది. రేమండ్‌కు సంబంధించిన ప్రాజెక్టులకు సీఎం చంద్రబాబు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ఏపీలో రేమండ్‌ గ్రూప్‌ 1200 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనుంది. రాష్ట్రంలో మూడు ప్రాజెక్టులు ఏర్పాటు ద్వారా 6 వేల 500 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు కల్పించనుంది రేమండ్‌ సంస్థ. 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. మూడు నాలుగేళ్లలోనే ఆ హామీ నెరవేరుతుందన్నారు. రాయలసీమలో గ్రీన్‌ ఎనర్జీ, సోలార్‌ ఎనర్జీ, విండ్‌ ఎనర్జీ ప్లాంట్స్ వస్తున్నాయని సీఎం చంద్రబాబు తెలిపారు.