రోడ్డు దాటుతుండగా ఊహించని పరిస్థితి.. ఆ అమ్మాయి చివరికి వీడియో

Updated on: Jun 23, 2025 | 12:13 PM

అనుకున్నదొక్కటి.. అయినది ఒక్కటి.. బోల్తా కొట్టిందిలే బుల్‌ బుల్‌ పిట్ట.. అన్నాడో సినీ కవి. మనం అనుకున్నవన్నీ అనుకున్నట్టు జరిగిపోవు. ఒక్కోసారి మనం ఒకరకంగా ప్లాన్‌ చేస్తే అది బెడిసికొట్టి మొదటికే మోసపోయే పరిస్థితి వస్తుంది. అలాంటి సందర్భాల్లో ఈ పాట తప్పక గుర్తుకొస్తుంది. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. ఓ అమ్మాయి రోడ్డు దాటడానికి ప్రయత్నిస్తూ.. రోడ్డు దాటలేకపోగా.. తన చెప్పులను కోల్పోవాల్సి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతూ నెట్టిజన్లను తెగ నవ్విస్తోంది. అక్కా ఎందుకంత తొందర.. కాస్త ఆగి వెళ్లొచ్చుకదా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

రోడ్ల మీద నడిచి వెళ్లేటపుడు, ట్రాఫిక్ సమయాల్లో, రహదారుల మరమ్మత్తులు జరుగుతున్నప్పుడు కొంచెం ముందు వెనుకా చూసుకొని నడవాలి. తొందరగా వెళ్లిపోవాలని ఎలాపడితే అలా రోడ్డుకి అడ్డబడితే మూల్యం చెల్లించుకోక తప్పదు. తాజాగా ఓ యువతికి అలాంటి పరిస్థితే ఎదురైంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక చోట కొత్తగా రోడ్డు వేస్తున్నట్టు తెలుస్తోంది. రహదారి నిర్మాణ కార్మికులు రోడ్డు మీద ఓవైపుగా తారు వేసుకుంటూ వెళ్తున్నారు. ఆ సమయంలో ఓ యువతి ఆ రోడ్డు దాటి ఇవతలి నుంచి అవతలికి వెళ్లాలనుకుంది. అంతే వెనుకా ముందూ ఆలోచించకుండా గబగబా అప్పుడే వేసిన తారు రోడ్డుమీద నుంచి నడిచి వెళ్లబోయింది. అప్పుడే వేసిన తారు ఇంకా ఆరకపోవడంతో ఇలా అడుగు పెట్టిందో లేదో అలా చెప్పులు తారుకి అతుక్కుపోయాయి. ఇంకేముంది… మరో అడుగు వేద్దామంటే చెప్పులు ఊడిరాలేదు. దీంతో చెప్పులను అక్కడే వదిలేసి వెనక్కి వెళ్లిపోయింది. రెండోవైపు కూడా తారు వేసేస్తే వెళ్లడం కష్టమని వేగంగా రోడ్డు దాటుదామనుకున్న ఆమె ప్లాన్‌ బెడిసి కొట్టింది. ఈ ఘటనను అక్కడున్న కొందరు రికార్డు చేసి ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఇప్పటివరకు లక్షమందికి పైగా వీక్షించారు. వేలమంది లైక్‌ చేస్తూ ఫన్నీ కామెంట్లు చేశారు.

మరిన్ని వీడియోల కోసం :

పాముకు ముద్దుపెట్టిన రైతు.. చివరకు వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే!

భర్త అంటే ఇష్టం లేని భార్య ఏం చేసిందో చూడండి వీడియో

మత్స్యకారుల వలలో విచిత్ర చేప… అపశకునం అంటూ భయాందోళనలు వీడియో