బంగారం అంటే ఇష్టపడని వారెవరుంటారు? బంగారం ప్రియులు కొందరు ఒంటినిండా నగలు వేసుకొని మురిసిపోతే.. మరికొందరు ధనవంతులు భోజనానికి కూడా బంగారు పళ్లెం ఉపయోగిస్తుంటారు. వీళ్లందరినీ మించి ఏకంగా బంగారంతో ఓ పెద్ద హోటల్ నిర్మించారంటే నమ్ముతారా? అదికూడా 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్. అవును. ఈ హోటల్ పేరు హనోయి గోల్డెన్ లేక్. ఇది వియత్నాం రాజధాని హనోయిలో ఉంది. ఇది పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది. ఎందుకంటే ఈ హోటల్ లోపల, బయటా కూడా ప్యూర్ గోల్డ్‌తో పూత పూయించారు. సాధారణంగా ఆలయ గోపురాలకు బంగారు తాపడం చేయించడం మనకు తెలుసు. కానీ ఈ హోటల్ మొత్తం బంగారం పూత చేయించారు. అంతేకాదు ప్రపంచంలోనే మొట్టమొదటి బంగారం పూతపూసిన ఏకైక హోటల్ ఇది. ఈ హోటల్ని 2009లో నిర్మించారు. ఆ సమయంలో ఈ డోల్స్ హనోయి గోల్డెన్ లేక్ హోటల్‌కి వచ్చే అతిథులకు గోల్డ్ కప్పులో కాఫీని అందించింది. ఇక్కడ సర్వ్ చేసే గిన్నెలు, భోజనం ప్లేట్లు, గ్లాసు, చెంచా అన్నీ బంగారమే. ఇప్పుడు హోటల్ కూడా మొత్తం బంగారంతో తయారైంది. అంతేకాదు, ఇక్కడ స్నానం చేసే స్విమ్మింగ్ పూల్, టెర్రస్, బాత్ టబ్ అన్నీ బంగారు పూతతో ఉంటాయి. అక్కడ టాయిలెట్ సీటు కూడా బంగారు పూతతో తయారు చేశారంటే ఎంతో రిచ్చో అర్ధమవుతుంది. గోల్డ్.. స్ట్రెస్‌ని తగ్గిస్తుందని చాలా మంది నమ్ముతారు. అందుకే ఈ స్టార్ హోటల్ని పూర్తిగా బంగారంతో తయారు చేశారట నిర్వాహకులు. దాదాపు 54 వేల అడుగుల నడక మార్గం, స్విమ్మింగ్ పూల్, గోడలు, నేల అన్నీ బంగారు పూతతో కప్పబడి ఉన్నాయి. నిజానికి ఇక్కడ అన్నీ బంగారంతో చేసినవే. 25 అంతస్తుల ఈ హోటల్ లో మొత్తం 400 గెస్ట్ రూమ్‌లు ఉంటాయి. అయితే ఇక్కడకి వెళ్లడం ధనవంతులకి మాత్రమే సాధ్యం అనుకోకండి. సామాన్యులు కూడా వెళ్లచ్చు. అందుకే ఇది నెట్టింట తెగ పాపులర్ అయిపోయింది. ఈ గోల్డ్ ప్లేటెడ్ స్టార్ హోటల్ అతి ధనవంతుల నుంచి సామాన్యుల వరకు ప్రతి ఒక్కరు విజిట్ చేయడానికి ఆహ్వానిస్తోందని, హోటల్ యాజమాన్యంలోని ఒకరు తెలిపారు. ఇక ఈ లగ్జరీ గోల్డ్ హోటల్లో ఒకరోజు స్టే చేయడానికి 250 డాలర్లు ఖర్చవుతుంది. అంటే ఇండియన్ కరెన్సీలో సింగిల్ బెడ్రూంకు 20 వేలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అదే డబుల్ బెడ్ రూమ్ అయితే 75 వేల రూపాయలు చెల్లించాలి. మరిన్ని వీడియోస్ కోసం: Videos Lati Charge on Allu Arjun Fans: అర్థరాత్రి పోలీసోళ్లకు చుక్కలే..! ఏమాత్రం తగ్గని బన్నీ ఫ్యాన్స్.. Allu Arjun Vibrant Look: ఉగ్రగంగమ్మగా పుష్పరాజ్.. సీన్ దద్దరిల్లాలే.. నెట్టింట ఊచకోత కోస్తున్న బన్నీ వీడియో.. Pushpa-2 Video: పుష్ప అడుగుపడితే.. పులి కూడా కుక్క అయిపోవాలే..! సోషల్ మీడియాను రఫ్పాడిస్తున్న పుష్ప..