ఆమె వేగంముందు మెషిన్లు కూడా బలాదూర్ అంటున్న నెటిజన్లు
సాధారణంగా బ్యాంకుల్లో, పెద్ద పెద్ద వ్యాపార సంస్థల్లో నోట్లు లెక్కపెట్టడానికి మెషిన్లు ఉపయోగిస్తుంటారు. ఎందుకంటే పెద్దమొత్తంలో నగదు కౌంట్ చేయాలంటే చేతులతో చేస్తే చాలా టైం పడుతుంది. అందుకే వేగంగా క్యాష్ కౌంట్ చేయడానికి మెషిన్లను అందుబాటులోకి తెచ్చారు.
సాధారణంగా బ్యాంకుల్లో, పెద్ద పెద్ద వ్యాపార సంస్థల్లో నోట్లు లెక్కపెట్టడానికి మెషిన్లు ఉపయోగిస్తుంటారు. ఎందుకంటే పెద్దమొత్తంలో నగదు కౌంట్ చేయాలంటే చేతులతో చేస్తే చాలా టైం పడుతుంది. అందుకే వేగంగా క్యాష్ కౌంట్ చేయడానికి మెషిన్లను అందుబాటులోకి తెచ్చారు. అయితే ఆ మెషిన్లను మించిన వేగంతో క్యాష్ కౌంట్ చేస్తూ ఔరా అనిపిస్తోంది ఓ మహిళ. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ మహిళ తాను పనిచేసే సంస్థలో క్యాష్ కౌంటర్‌లో కూర్చుని ఉంది. కట్టల కొద్దీ కరెన్సీ నోట్లను సెకెన్లలో కౌంట్ చేసి పక్కన పడేస్తుంది. ఆమె నగదు లెక్కపెడుతున్న తీరుకి, ఆమె స్పీడుని చూసి అక్కడున్నవారంతా షాకయ్యారు. ఈ వీడియోను ఓ యూజర్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. అది చూసి నెటిజన్లు కూడా నోరెళ్లబెడుతున్నారు. రెప్పపాటులో ఆమె కట్టలు కట్టలు లెక్కిస్తున్న తీరుకు ఆశ్చర్యపోతున్నారు. ఆ చేతులముందు మెషిన్లు కూడా ఎందుకూ పనిచేయవంటున్నారు. ఇలాంటివాళ్లు బ్యాంకుకొక్కరైనా ఉండాలంటున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అదృష్టం అంటే అతనిదే.. రెప్పపాటులో అద్భుతం
మొసలి నోట్లో చెయ్యి పెట్టిన వ్యక్తి !! క్షణాల్లో..
ఇంటి నిర్మాణం కోసం తవ్వకాలు.. బయటపడ్డ..
Adipurush: అదిరిపోయిన ఆదిపురుష్ 3D ట్రైలర్
Ustaad Bhagat Singh: గెట్ రెడీ.. మే11న ఉస్తాద్ వస్తున్నాడు