తీహార్‌ జైలుకు ఇంటర్న్‌గా యువతి కళ్లారా ఏం చూసిందంటే..?వీడియో

Updated on: May 02, 2025 | 8:27 PM

ఇటీవల ఢిల్లీలోని అత్యంత కట్టుదిట్టమైన తీహార్ జైలులో ఇంటర్న్‌షిప్ చేసింది ఓ యువతి. అది సాధారణ జైలు ఎంత మాత్రం కాదు. కరడుగట్టిన ఖైదీలున్న ప్రాంతం. కేవలం మగ ఖైదీలు ఉండే బ్లాక్‌లో రెండు వారాల పాటు ఇంటర్న్‌గా పనిచేసింది ఘజియాబాద్‌కు చెందిన దియా కహాలీ. తను కళ్లారా ఏం చూసిందో, ఎలాంటి అనుభవాలను ఎదుర్కొందో పోస్ట్ చేసిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. “ surviving and thriving: my reality as a psychology trainee at tihar prison complex'' పేరిట ఆమె రాసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.తన పోస్ట్‌లో దియా అసలు విషయం చెప్పింది. మొత్తం మగవాళ్లు ఉండే యూనిట్‌లో తాను ఒక్కదాన్నే అమ్మాయిని అని ఒక్క మహిళా గార్డు తప్ప చుట్టూ అంతా మగవాళ్లే ఈ పరిస్థితి ఎంత కష్టంగా ఉంటుందో వివరించింది.

“ఒకేసారి అందరికీ కనిపిస్తాం, కానీ ఎవరూ పట్టించుకోనట్లు అనిపిస్తుంది” అని ఆమె రాసింది. ఖైదీలు ఆమెను సీరియస్‌గా తీసుకోలేదట. కొన్నిసార్లు సిబ్బంది కూడా పట్టించుకోలేదని, ఎప్పుడూ ఎవరో చూస్తున్నట్లే అనిపించిందని దియా తన అనుభవాన్ని పంచుకుంది. ఈ ఇంటర్న్‌షిప్‌కు సరైన పద్ధతి లేదని కూడా ఆమె చెప్పింది.ఈ ప్రోగ్రామ్ ఇంకా కొత్తగా ఉన్నందున, సహాయం కోసం పదే పదే అడగాల్సి వచ్చిందని, సూచనలను మళ్లీ మళ్లీ సరిచూసుకోవాల్సి వచ్చిందని వివరించింది.“మీ భద్రతకు ఎప్పుడూ మొదటి ప్రాధాన్యత ఇవ్వండి” అని ఆమె నొక్కి చెప్పింది. ఏదైనా పరిస్థితి సురక్షితంగా లేదనిపిస్తే, వెంటనే గార్డు సహాయం తీసుకోవాలని సూచించింది. దియా చేయాల్సిన పనులు ఏంటంటే, ఖైదీలను ఇంటర్వ్యూ చేయడం, వాళ్ల కష్టాలు, కథలు వినడం, వాటిపై రిపోర్టులు రాయడం. అయితే, చాలా మంది ఖైదీలు మౌనంగా ఉండేవారట, కొందరు అనుమానంగా చూసేవారట, మరికొందరు డామినేట్‌ చేసేలా మాట్లాడేవారట. వారితో నమ్మకాన్ని పెంచుకోవడానికి, దియా ఉదాహరణలు చెబుతూ, వ్యక్తిగతంగా మాట్లాడించే ప్రయత్నం చేసిందట.

మరిన్ని వీడియోల కోసం :

నడిరోడ్డు పై గిరినాగు..పడగ విప్పి.. బుసలు కొట్టి..వీడియో

ఫ్యామిలీని కాపాడిన “సాల్ట్‌’.. ఉగ్రదాడి నుంచి తృటిలో తప్పుకున్నారు

గుండెపగిలే వార్త తెలియక..కుమారుడి రాకకోసం తల్లిదండ్రుల ఎదురుచూపులు..