వావ్‌.. ఏం టైమింగ్ గురూ.. మూడు తలల చీతా .. ఎప్పుడైనా చూసారా ??

|

Jul 04, 2023 | 9:56 AM

అత్యంత వేగంగా పరిగెత్తే జీవి చిరుత. చీతాకు ఏ జంతువైనా అడ్డుపడితే ప్రాణాలు గాల్లో వదిలేయాల్సిందే. ప్రపంచవ్యాప్తంగా చీతాల జాతి అంతరించిపోయే దశకు చేరుకుందని పలు నివేదికలు చెబుతున్నాయి. అలాంటిది ఆఫ్రికాలోని కొన్ని అడవుల్లో మాత్రం చీతాలు విరివిగా కనిపిస్తున్నాయి.

అత్యంత వేగంగా పరిగెత్తే జీవి చిరుత. చీతాకు ఏ జంతువైనా అడ్డుపడితే ప్రాణాలు గాల్లో వదిలేయాల్సిందే. ప్రపంచవ్యాప్తంగా చీతాల జాతి అంతరించిపోయే దశకు చేరుకుందని పలు నివేదికలు చెబుతున్నాయి. అలాంటిది ఆఫ్రికాలోని కొన్ని అడవుల్లో మాత్రం చీతాలు విరివిగా కనిపిస్తున్నాయి. అలాంటి అడవిలో ఓ వైల్డ్‌లైఫ్‌ ఫొటోగ్రాఫర్ అద్భుతమైన చీతాను తన కెమెరాలో బంధించాడు. తన ఫేస్‎బుక్ అకౌంట్‎లో షేర్ చేశాడు. ఫొటోను చూసిన వారంతా ఆ ఫొటోగ్రాఫర్‌ను పొగడ్తలతో ముంచేస్తున్నారు. అతని క్రియేటివిటికి ఫిదా అవుతున్నారు. వరల్డ్‌లైఫ్‌ ఫొటోగ్రాఫర్‌ పాల్‌ గోల్డ్‌స్టీన్‌ మూడు తలలు ఉన్న చిరుత ఫోటోను తన కెమెరాలో బంధించాడు. ఈ ఫోటో తీయడానికి ఫోటోగ్రాఫర్ ఏకంగా 7 గంటల పాటు వర్షంలో తడిసి ముద్దయ్యాడట. అంతటి కష్టానికి ఈ అద్భుతమైన ఫోటో సాక్ష్యంగా నిలుస్తుంది. సోషల్ మీడియాలో ఈ పిక్ షేర్ చేసి తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఈ పొటోను ఒకసారి పరీక్షగా చూస్తే ఒకే చిరుతకు మూడు తలలు ఉన్నట్లు ఉంటుంది. కానీ నిజానికి అవి మూడు చిరుతలు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పిడుగు పడుతున్న వీడియో చూసారా.. షాకింగ్‌ వీడియో వైరల్‌

తిరుమలలో అరుదైన తొండ.. తిరునామాలతో దర్శనం

ముచ్చటపడి నోట్ల కట్టలతో సెల్ఫీలు .. చివరికి ..

కరీంనగర్‌లో కెమెరా దేవత.. ప్రత్యేక పూజలు చేసిన భక్తులు

రివాల్వర్‌తో రెచ్చిపోయిన సచివాలయ ఉద్యోగి.. ఆ తర్వాత..