Wife – husband: భార్య రమ్మంటే రావడం లేదు.. పోలీస్ భర్తకు చిర్రెత్తుకొచ్చింది..! ఎం చేసాడో తెలుస్తే షాకే..!
కాపురంలో భార్య, భర్తల మధ్య గొడవలు సర్వ సాధారణమే. భర్తతో గొడవపడి భార్య పుట్టింటికి వెళ్లడం.. చాలా ఇళ్లల్లో జరుగుతుంటాయి. అయితే, కొందరు రెండు మూడు రోజులు ఉండి.. తిరిగి భర్త వద్దకు వచ్చేస్తారు.
కాపురంలో భార్య, భర్తల మధ్య గొడవలు సర్వ సాధారణమే. భర్తతో గొడవపడి భార్య పుట్టింటికి వెళ్లడం.. చాలా ఇళ్లల్లో జరుగుతుంటాయి. అయితే, కొందరు రెండు మూడు రోజులు ఉండి.. తిరిగి భర్త వద్దకు వచ్చేస్తారు. మరికొందరు పుట్టింట్లోనే భీష్మించుకొని కూర్చుంటారు. ఇలాంటప్పుడే రచ్చ పెద్దదై కాపురాలు కూలిపోతాయి. ఒక్కోసారి ప్రాణాలు తీసుకునేంత వరకు వెళ్తుంటాయి. బీహార్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. తన భార్యను కాపురానికి పంపించడం లేదని.. అత్తింటి వారిపై కాల్పులు జరిపాడు ఓ పోలీస్. పిల్లనిచ్చిన మామను కాల్చి చంపాడు. తీవ్రంగా గాయపడ్డ బావమరిది ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య కొట్టమిట్టాడుతున్నాడు. ముంగేర్ జిల్లా కాసిం బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఘోసి తోలాకు చెందిన గిర్‌ధర్ సావో బ్యాంకు ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అతడి కుమార్తె అంచల్ కుమారిను గత ఏడాది జులై 16న.. నలంద జిల్లా హిల్సాకు చెందిన సోనుకుమార్‌కు ఇచ్చి పెళ్లి చేశారు. సోనుకుమార్ జాముయి ఎస్పీ నివాసంలో విధులు నిర్వర్తిస్తున్నాడు. పెళ్లయ్యాక కొన్ని రోజుల పాటు భార్యాభర్తలు బాగానే ఉన్నారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఈ క్రమంలోనే కొన్ని రోజుల క్రితం అంచల్ కుమారి పుట్టింటికి వెళ్లిపోయిది. రోజులు గడుస్తున్నా రాకపోవడంతో… సోనుకుమార్ కోపంతో ఊగిపోయాడు. కాపురానికి పంపిస్తారా? లేదా? అని అత్తామామలకు ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చాడు. అయినా ఆమె రాకపోవడంతో.. మంగళవారం నేరుగా రివాల్వర్‌తో మరోసారి అత్తింటికి వెళ్లి రచ్చచేశాడు. ఈ క్రమంలో తుపాకీతో మామ గిర్‌ధర్ సావో, బావమరిది కృష్ణకుమార్‌పై కాల్పులు జరిపి పారిపోయాడు. మామ మృతి చెందగా, బావమరిది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అనంతరం సోనుకుమార్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sorry: పుణ్యం కోసం రామకోటి రాస్తారు.. మరీ సారీ కోటి ఏంటో..? గోడలు, మెట్లు, చెట్టు, కొమ్మ అంతటా సారీ, సారీ..
Rashmika Mandanna: క్రష్మిక క్రష్ ఎవరో చెప్పేసింది.. స్కూల్ డేస్ నుంచి అతనంటే చాలా ఇష్టం..!
Man dies in hotel: హోటల్‌లో ప్రేయసితో శృంగారం చేస్తూ వ్యక్తి మృతి.. ఏం జరిగిందంటే..?
Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్..!