48 ఏళ్లుగా నీళ్లే తాగలేదట.. మరి ఏం తాగారో తెలుసా!

Updated on: Nov 04, 2026 | 9:51 AM

ప్రపంచ దిగ్గజ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్‌కు సంబంధించిన ఆసక్తికర విషయం బయటపడింది. దాదాపు 48 ఏళ్లుగా నీళ్లు తాగడం లేదని, చెర్రీ కోక్‌నే ఇష్టపడతారని బిల్ అక్‌మన్ వెల్లడించారు. గతంలో రోజుకు కనీసం ఐదు డబ్బాల కోక్ తాగుతానని బఫెట్ చెప్పారు. ఒకప్పుడు పెప్సీకి వీరాభిమానిగా ఉన్న ఆయన, 1986లో చెర్రీ కోక్‌ను తన అభిమాన పానీయంగా మార్చుకున్నారు.

ప్రపంచ దిగ్గజ ఇన్వెస్టర్లలో ఒకరైన వారెన్ బఫెట్‌ గురించి ఒక ఆసక్తికరమైన వార్త వెలుగులోకి వచ్చింది. 96 ఏళ్ల వయస్సున్న బఫెట్, దాదాపు గత ఐదు దశాబ్దాలుగా నీళ్లు తాగడం లేదట! నీటికి బదులుగా తన దాహాన్ని తీర్చుకోవడానికి ఆయనకు అత్యంత ఇష్టమైన ‘చెర్రీ కోక్’ పానీయాన్నే తాగుతారట. ఈ ఆశ్చర్యకర విషయాన్ని ప్రముఖ బిలియనీర్, హెడ్జ్ ఫండ్ మేనేజర్ బిల్ అక్‌మన్ ఇటీవల ఒక కార్యక్రమంలో బయటపెట్టారు. కొన్నేళ్ల క్రితం వారెన్ బఫెట్ తన ఇంటికి డిన్నర్‌కు వచ్చినప్పుడు జరిగిన అనుభవాన్ని అక్‌మన్ గుర్తుచేసుకున్నారు. డిన్నర్ సమయంలో బఫెట్‌కు నీళ్లు ఆఫర్ చేయగా, ఆయన సున్నితంగా తిరస్కరించారట. “మీరు నీళ్లు తాగరా?” అని అడగ్గా.. “బిల్, నేను గత 48 ఏళ్లుగా నీళ్లే తాగలేదు” అని బఫెట్ సమాధానమిచ్చినట్లు చెప్పారు. దీంతో ఆయన కోసం ప్రత్యేకంగా చెర్రీ కోక్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కోకా-కోలా పట్ల తనకున్న పిచ్చి అభిమానాన్ని బఫెట్ గతంలోనూ అనేకసార్లు వెల్లడించారు. “నేను పావు వంతు కోకా-కోలానే” అని 2015లో ఓ ఇంటర్వ్యూలో సరదాగా వ్యాఖ్యానించారు. రోజుకు తాను తీసుకునే 2,700 కేలరీలలో నాలుగో వంతు కేలరీలు కోకా-కోలా నుంచే వస్తాయని, రోజుకు కనీసం ఐదు డబ్బాల కోక్ తాగుతానని చెప్పారు. అయితే బఫెట్ మొదటి నుంచీ కోక్ ప్రియుడు కాదు. దాదాపు 48 ఏళ్ల పాటు ఆయన తీవ్రంగా పెప్సీని ఇష్టపడేవారు. ఆయన కుమారుడు హోవార్డ్ స్నేహితులు ఆయన్ను ‘పెప్సీ వారెన్’ అని కూడా పిలిచేవారు. కానీ 1986లో జరిగిన బెర్క్‌షైర్ హాత్వే వార్షిక సమావేశంలో అనూహ్యంగా ‘చెర్రీ కోక్’ను అధికారిక పానీయంగా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. నాటి నుంచి ఇప్పటివరకు ఆయన చెర్రీ కోక్ పానీయాన్నే క్రమం తప్పకుండా సేవిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Telangana: తెలంగాణ సర్కార్‌ కీలక నిర్ణయం.. సన్నబియ్యం ధరలకు కళ్లెం!

కూరగాయల సంచిలో నల్లత్రాచు.. భయంతో పరుగులు తీసిన వ్యాపారులు

నెటిజన్ల మనసులు గెలుచుకున్న కేంద్ర మాజీ మంత్రి! అమ్మకోసం ఆయన ఏం చేశారో చూడండి!

కేంద్ర ఖజానాకు కాసుల వర్షం.. రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు!

శభాష్ సీఐ గారు.. కాలుకి సర్జరీ అయినా ఆగని విధి నిర్వహణ

Loading...
Unable to load recommendations.
Follow Us