ఓరుగల్లు అబ్బాయి, ఇటలీ అమ్మాయిల ప్రేమ కథ.. క్లైమాక్స్ లో..

|

Dec 18, 2024 | 1:21 PM

ఓరుగల్లు అబ్బాయి.. ఇటలీ అమ్మాయి.. మనసులు కలిశాయి.. వాళ్ళ పెళ్లికి పెద్దలు సై అన్నారు.. ఇంకేముంది అచ్చ తెలుగు ఆచార సంప్రదాయాల ప్రకారం పెళ్లి వేడుకలు చకచకా జరిగిపోతున్నాయి. 18న పెళ్లి వేడుక ఉండగా శనివారం సాయంత్రం నిర్వహించిన సంగీత్ లో ఇటలీ అతిథులు, ఓరుగల్లులోని వరుడి బంధువులు తెగ సందడి చేశారు.

ఖండాంతరాలు దాటిన వారి ప్రేమతో పాటు.. పెళ్లి సంబరాలు అదుర్స్ అనిపించాయి. వరంగల్ లోని పోచమ్మ మైదాన్ కు చెందిన కొడిపాక సూర్యప్రీతం పైచదువుల కోసం లండన్‍ కు వెళ్ళాడు. ఈ క్రమంలో తనతో చదువుతున్న ఇటలీకి చెందిన మార్ట ఫ్రిట్టెల్ తో ప్రేమలో పడ్డాడు. ఈ ఇద్దరి ప్రేమ పెళ్లికి రెండు కుటుంబాలు ఒకే చెప్పాయి. ఈనెల 18న వరంగల్‍ నగరంలోని ఓ ఫంక్షన్‍హాల్లో సంప్రదాయ పద్ధతిలో వివాహానికి ఏర్పాట్లు చేశారు. పెళ్లికి ముందు నిర్వహించిన నిశ్చితార్థం, సంగీత్‍ వేడుకలో కాబోయే జంటతో పాటు ఇటలీలో ఉన్న అమ్మాయి తరపు కుటుంబ సభ్యులంతా పాల్గొన్నారు. లోకల్‍ మాస్‍ పాటలకు స్టెప్పులు వేశారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TOP 9 ET News: RRRను దాటేసిన పుష్ప రాజ్ | తండ్రి మాత్రమే కాదు.. అమ్మ కూడా విష్ణు పక్షమే

వీడెవడండి బాబూ !! చిన్న విషయానికే చేతి వేళ్లు నరుక్కున్నాడు !!

ప్రేమ దక్కాలంటే త్యాగం చేయాలి.. అందుకే అతడి కోసం సినిమాలు వదలేయాలని అనుకున్నా..

గతాన్ని గుర్తుకుతెచ్చుకుని స్టేజ్‌పైనే ఏడ్చిన యూట్యూబ్ స్టార్

Dhanush: చంద్రబాబు బయోపిక్‌లో ధనుష్‌