గ్యాస్‌ అక్కర్లేదు.. కిరోసిన్, నీటితో నడిచే స్టవ్‌ వచ్చేసింది

Updated on: Sep 17, 2026 | 2:45 PM

మధ్యప్రదేశ్‌కు చెందిన వ్యాస్ జీ మిశ్రా కిరోసిన్, నీటిని ఉపయోగించి వినూత్న హైబ్రిడ్ స్టవ్‌ను రూపొందించారు. ఇది సాధారణ స్టవ్‌ల కంటే 20 శాతం కిరోసిన్‌ను ఆదా చేస్తుంది. కేవలం రూ. 600 ఖర్చుతో తయారైన ఈ స్టవ్, పొగ సమస్యను తగ్గించి, తక్కువ ఆదాయ కుటుంబాలకు, గ్రామీణ ప్రాంతాలకు ఆర్థికంగా అందుబాటులో ఉండే పరిష్కారం.

మధ్యప్రదేశ్‌లోని దేవ్‌సర్‌కు చెందిన వ్యాస్ జీ మిశ్రా సైన్స్ పట్ల తనకున్న ఆసక్తితో ఒక అద్భుతమైన ఆవిష్కరణకు రూపకల్పన చేశారు. గతంలో డ్రిప్ ఇరిగేషన్ మోడల్‌తో ప్రథమ బహుమతి గెలుచుకున్న ఆయన, తాజాగా తన అన్నయ్య సహాయంతో సరికొత్త హైబ్రిడ్ కిరోసిన్ స్టవ్‌ను తయారు చేశారు.సాధారణ కిరోసిన్ పొయ్యిలకు భిన్నంగా రెండు స్టవ్‌లను కలిపి, ఇందులో మూడు రెగ్యులేటర్లను అమర్చారు. ఇది కిరోసిన్, నీటి ప్రవాహాలను నియంత్రించి, నీటి ఆవిరి ప్రక్రియకు సహకరిస్తుంది. ఈ వినూత్న స్టవ్ ద్వారా కిరోసిన్ వినియోగం దాదాపు 20 శాతం వరకు ఆదా అవుతుందని ఐఐటీ గువాహటి నిపుణులు పరీక్షించి నిర్ధారించారు.మొదటి ప్రోటోటైప్ తయారీకి కేవలం 600 రూపాయలు మాత్రమే ఖర్చు కావడంతో, తక్కువ ఆదాయ కుటుంబాలకు ఇది ఎంతో ఉపయోగకరంగా, ఆర్థికంగా అందుబాటులో ఉండే పరిష్కారంగా నిలిచింది. 2003లో జరిగిన రాష్ట్ర స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ లో ఈ ఆవిష్కరణ ప్రథమ బహుమతి సాధించి, అప్పటి విద్యాశాఖ మంత్రి ఇంద్రజిత్ కుమార్ పటేల్ చేతుల మీదుగా అవార్డు అందుకుంది. నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ మైక్రో వెంచర్ ఇన్నోవేషన్ ఫండ్ ద్వారా దీనికి 37,250 రూపాయల ఆర్థిక సహాయాన్ని కూడా అందించింది.

మరిన్ని వీడియోల కోసం :

బిగ్ బాస్‌ టాస్కులేమో కానీ ఆ కంటెస్టెంట్ నడుము విరిగినంత పనైంది

నేనే త్రిష స్థానంలో ఉంటే..నటి అంబిక షాకింగ్ కామెంట్స్

నా 3 కోట్లు నాకు ఇప్పించండి…కోర్టుకెక్కిన ఐబొమ్మ రవి

హాలీవుడ్‌లోకి మహారాజ్‌ మూవీ…హీరో ఎవరంటే?

Loading...
Unable to load recommendations.
Follow Us