ప్రాణం పోసిన స్నేక్‌ క్యాచర్‌కు నాగుపాము కృతజ్ఞత.. ఏం చేసిందో చూడండి

Updated on: Apr 06, 2026 | 6:16 PM

విశాఖపట్నం శ్రీహరిపురంలో ఎండ తీవ్రతకు, పొగ ధాటికి సొమ్మసిల్లిన ఆరడుగుల నాగుపామును స్నేక్ క్యాచర్ నాగరాజు మానవత్వంతో కాపాడాడు. స్థానికులు పొగపెట్టగా ఊపిరాడక అపస్మారక స్థితిలోకి వెళ్లిన సర్పానికి చల్లటి నీరు అందించి, కోలుకునేలా చేసి సురక్షితంగా అడవిలో విడిచిపెట్టాడు. ఈ ఘటన వన్యప్రాణుల పట్ల దయ చూపాలని సందేశాన్నిస్తోంది.

పెరుగుతున్న భానుడి భగభగలు కేవలం మనుషులనే కాదు, మూగజీవాలనూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. విశాఖలోని శ్రీహరిపురంలో చోటుచేసుకున్న ఒక ఘటన ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. శ్రీహరిపురానికి చెందిన బాలరాజు ఇంట్లోకి సుమారు ఆరడుగుల నాగుపాము చొరబడింది. పాత సామాన్ల మధ్య దాక్కున్న ఆ పామును బయటకు రప్పించేందుకు స్థానికులు సంప్రదాయ పద్ధతిలో పొగ పెట్టారు. అయితే, ఎండ వేడికి తోడు ఆ పొగ ధాటికి పాము బయటకు రాకపోగా, లోపలే ఊపిరాడక సొమ్మసిల్లిపోయింది. ఎంతకీ పాము బయటకు రాకపోవడంతో ఇక లాభం లేదనుకొని స్థానిక స్నేక్‌ క్యాచర్‌కు సమాచారమిచ్చారు స్థానికులు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న స్నేక్ క్యాచర్ నాగరాజు పామును రక్షించేందుకు రంగంలోకి దిగాడు. అపస్మారక స్థితిలో ఉన్న ఆ విషసర్పాన్ని చాకచక్యంగా బయటకు తీశాడు. పాము నీరసించిపోవడాన్ని గమనించిన ఆయన, మానవత్వంతో దానికి సపర్యలు చేశాడు. ఆ నాగుపాముపై చల్లటి నీటిని చల్లుతూ, తాగేందుకు నీరు అందించారు. నీటి చల్లదనానికి సేదతీరిన ఆ సర్పం, నెమ్మదిగా తేరుకుని లేచి నిలబడి పడగ విప్పి నాగరాజవైపు కృతజ్ఞతగా చూసింది. ఆ దృశ్యం చూపరులను ఆశ్చర్యానికి గురిచేసింది. పూర్తిగా కోలుకున్నాక, నాగరాజు ఆ పామును సురక్షితంగా సమీపంలోని అడవిలో విడిచిపెట్టారు. ప్రాణాపాయంలో ఉన్న మూగజీవాన్ని కాపాడిన నాగరాజుపై అందరూ ప్రశంసలు కురిపించారు. ఎండల నేపథ్యంలో వన్యప్రాణుల పట్ల అమానుషంగా ప్రవర్తించవద్దని, వెంటనే స్నేక్‌ క్యాచర్‌కు సమాచారమివ్వాలని వన్యప్రాణి ప్రేమికులు కోరుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మళ్లీ కట్టెల పొయ్యిలపై ప్రజల వంటలు.. బయో గ్యాస్‌కూ పెరిగిన డిమాండ్‌ !!

ఇంతందంగా ఉన్నావే.. నెలవంకలా భూమి

క్రికెట్ మ్యాచ్‌లో వివాదం.. కత్తిపోట్లతో యువకుడి మృతి

Weather Update: తెలుగు రాష్ట్రాలకు పొంచివున్న తుఫాను ముప్పు

Gold Price Today: తగ్గిన బంగారం ధర.. ఇవాళ ధర ఎంతంటే ??

Loading...
Unable to load recommendations.
Follow Us