బుర్ఖా ధరించి చైన్ స్నాచింగ్.. కట్ చేస్తే..
విజయవాడలో ఓ ఆటో డ్రైవర్ జోసెఫ్, అప్పుల బాధలు తాళలేక ఆడ వేషంలో స్కూటీపై వచ్చి వృద్ధురాలి మెడలో బంగారు గొలుసును లాక్కెళ్లాడు. సీసీ కెమెరాలకు దొరకకుండా మహిళలాగా కనిపించినా, స్కూటీ నెంబర్ ప్లేట్ ఆధారంగా పోలీసులు అతడిని గుర్తించి అరెస్ట్ చేశారు. ఒప్పుకున్న జోసెఫ్ చోరీ చేసిన బంగారాన్ని తిరిగి అప్పగించాడు.
ఓ ఆటోడ్రైవర్ ఆడ వేషంలో స్కూటీపై వచ్చి వృద్ధురాలి మెడలో బంగారం లాక్కెళ్లడం విజయవాడ లో కలకలం రేపింది. విజయవాడ నగర శివారు నున్న గ్రామీణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉడా కాలనీకి చెందిన ఓ వృద్ధురాలు ఇంటి ముందు కూర్చుని ఉన్న సమయంలో ఆమ మెడలోని చైన్ చోరీకి గురైంది. మహిళ ఫిర్యాదుతో కండ్రిక ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ జోసెఫ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే పురుషుడిగా చైన్ స్నాచింగ్ పాల్పడితే సీసీ కెమెరాల్లో పట్టుబడతాననే భయంతో జోషెప్ అతని భార్య బట్టలను ధరించి అచ్చు మహిళ లాగా స్కూటీపై వృద్ధురాలు ఉండే ప్రాంతానికి వచ్చాడు. సీసీ కెమెరాలో అచ్చం మహిళలా కనిపించిన జోసెఫ్‌ను చూసి పోలీసులు కంగుతిన్నారు. నిందితుడు వాడిన స్కూటీ నెంబర్ ప్లేట్ ఆధారంగా మహిళ కాదని ముందుగా నిర్ధారించుకున్న పోలీసులు ఆ దిశగా విచారణ చేయగా జోసఫ్ కన్నింగ్ ప్లాన్ ఫ్లాప్ బయటపడింది. ఇంటి ముందు ఆమె కూర్చుని ఉండగా చైన్ స్నాచింగ్ చేసాడు. చైన్ స్నాచింగ్ కు పాల్పడిన జోషెప్ ను సాంకేతిక ఆధారాలతో అదుపులో తీసుకొని పోలీసు మార్క్ ట్రీట్మెంట్ ఇవ్వగా నేరం ఒప్పుకున్నాడు. మహిళ మెడలో చోరీ చేసిన బంగారు గొలుసును పోలీసులకు అప్పగించాడు. ఒ ఆటో డ్రైవర్ గా వృద్ధురాలిని ఆమె బంధువులను బయటకు తీసుకెళ్లడం తీసుకురావడం చేస్తుంటానని తెలిపాడు. అప్పుల వారి వేధింపులు పడలేక చైన్ స్నాచింగ్‌కి పాల్పడినట్టు చెప్పాడు. తనను ఎవరూ గుర్తుపట్టరని భావించి మహిళ వేషం వేసుకొని దొంగతనం చేసి చివరికి కటకటాల వెనక్కు వెళ్లాడుజోషెప్.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కర్తవ్యం కానిస్టేబుల్ కు.. ఏపీ హోం మంత్రి ఆత్మీయ సత్కారం
ఒకే చోట పూజ.. నమాజ్ ! సుప్రీం సంచలన తీర్పు
ప్రేమికులను వేటాడి చంపిన కసాయి అన్నలు
మొక్కులో వింత.. భక్తుల్లో మంట !! తప్పు ఒప్పుకున్న టీనా శ్రావ్య
