కింగ్ కోబ్రాతో ఇదేమి సయ్యాట సామి.. వీడియో
సోషల్ మీడియాలో ప్రతిరోజు పాములకు సంబంధించి అనేక వీడియోలు అప్‌లోడ్ అవుతుంటాయి. వాటిలో కొన్ని వీడియోలు నెటిజన్స్‌ను ఇట్టే ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా పాముల సయ్యాటలు, ఫైటింగ్‌ల వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. అయితే కొంతమంది మాత్రం అత్యంత ప్రమాదకరమైన విషపు పాములతో ఆటలు ఆడుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటూ ఉంటారు.
పాములకు దగ్గరగా వెళ్లడం, వాటిని తాకాలని ట్రై చేయడం వంటి పనులు చేస్తుంటారు. పైగా వాటిని వీడియోలు తీస్తూ సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తుంటారు. అలాంటి ప్రమాదకరమైన వీడియోనే ఇప్పుడు మీకు చూపించబోతున్నాం. పాముల్లో కెల్లా కింగ్ కోబ్రాలు అత్యంత ప్రమాదకరమైనవి. ఒక్కసారి కాటేసిందా.. ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందే. అలాంటి కింగ్ కోబ్రాతో ఓ యువకుడు విన్యాసాలు చేయడం ఈ వీడియోలో కనిపిస్తుంది. వీడియోలో ఉన్నదాని ప్రకారం నల్లటి కింగ్ కోబ్రా పడగవిప్పి బుసలు కొడుతూ ఉంటుంది. దాని చుట్టూ ముగ్గురు వ్యక్తులు నిల్చుని ఉంటారు. అందులో ఓ వ్యక్తి దాని మెడను ఎలాంటి రక్షణ లేకుండానే చేతితో తాకుతూ రెచ్చగొడుతుంటారు. దీంతో అది మరింత బుసలు కొడుతూ ఉంటుంది.
మరిన్ని వీడియోల కోసం :
రమాప్రభకు రాజేంద్ర ప్రసాద్ ఏమవుతాడో తెలుసా?
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌తో పీకల్లోతు ప్రేమలో కావ్యా మారన్ .. క్లారిటీ..
అల్లు అర్జున్ ప్లానింగ్‌కు.. మైండ్ బ్లాక్ అవుతుందిగా..!వీడియో
అమీర్‌ఖాన్ కుమార్తెకు ఏమైంది?వీడియో