వీడికి ఇదేం మాయరోగం? మహిళలు బట్టలు ఆరేస్తే చాలు.. వీడియో!
సోషల్ మీడియాలో చిత్ర విచిత్రమైన వార్తలు వైరల్ అవుతుంటాయి. అలాంటిదే తాజాగా మరో వింత వార్త వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి వాక్‌వేలో ఆరేసిన మహిళల దుస్తులను దొంగిలిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వ్యక్తి చాలా రోజులుగా మహిళల బట్టలు దొంగిలిస్తున్నాడు. తరచూ బట్టలు మాయం కావడం గమనించిన ఆ మహిళ అతన్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడానికి ఒక పథకం వేసింది. ఆమె వేసిన స్కెచ్ లో అడ్డంగా బుక్కయ్యాడు సదరు దొంగోడు. యథావిధిగా అతడు ఆమె లోదుస్తులను దొంగిలిస్తూ పట్టుబడ్డాడు. సింగపూర్‌కు చెందిన ఫేస్‌బుక్ యూజర్ ఆల్వీ లిమ్ ఈ వీడియోను షేర్ చేసింది. ఈ సంఘటన తనకు అసహ్యం కలిగించిందంటూ రాసుకొచ్చింది.
రోజూ తన లోదుస్తులు ఎలా, ఎందుకు మాయమవుతున్నాయో తనకు ఏమాత్రం అర్థంకాలేదని చెప్పింది. విసుగెత్తి పోయిన ఆమె చివరకు తమ ఇంటి ఆవరణలో సీసీటీవీ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. సీసీటీవీ ఏర్పాటుతో అసలు విషయం తెలిసింది. సీసీ టీవీలో చూస్తే.. కారిడార్‌లో ఒక వ్యక్తి తిరుగుతూ కనిపించాడు. అతడు ఏం చేస్తున్నాడో కూడా మొత్తం కెమెరాలో రికార్డైంది. ఆ వ్యక్తి ఆమె బట్టల దగ్గర ఆగి ఆమె లోదుస్తులను దొంగిలించి తన ప్యాంటులో దాచుకోవటం వీడియోలో కనిపిస్తుంది. మరొక వీడియోలో ఒక వ్యక్తి లోదుస్తులను దొంగిలించడానికి బట్టల దగ్గర నిలబడి ఉండటం కనిపిస్తుంది. ఈసారి అతను ఆరేసిన లోదుస్తులు తీసుకునే క్రమంలోనే అతని దృష్టి కెమెరాపై పడింది. వెంటనే అలర్ట్ అయ్యాడు.. అతను వాటిని తన ప్యాంటు నుండి పక్కన పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. సదరు వ్యక్తి వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ ప్రాంతమంతా కలకలం రేగింది. ఇది చూసిన ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరిన్ని వీడియోల కోసం :
మహిళకు ఫ్లయింగ్ కిస్..ఎమ్మెల్యే పై కేసు
చలిమంట ఇలా కూడా కాచుకుంటారా?వీడియో
ఇంత దారుణమా?కన్న కొడుకుని కడతేర్చిన తండ్రి వీడియో
చెవులు కుట్టించబోతే చనిపోయిన బిడ్డ.. అసలేం జరిగింది? వీడియో
ఆస్తులు పంచి అంత్యక్రియల ఖర్చులు అకౌంట్లో వేసి. కుటుంబం ఆత్మహత్య
ప్రాణం తీసిన బంగీజంప్.. ఏం జరిగిందంటే..
వర్క్ ఫ్రమ్ బైక్.. అంత ఆత్రం ఎందుకు బాబూ..బ్రతకాలని లేదా నీకు!
అస్థిపంజరాలు చెప్పిన లక్షల ఏళ్ల నాటి రహస్యం..
92 ఏళ్ల వయసులో 30 ఏళ్ల ఫిట్నెస్..!
అక్కడ కొండచిలువల వేట చాలా ఫేమస్!
12 రోజుల పాటు కదలని ట్రాఫిక్ జామ్.. ఎక్కడ? ఎప్పుడు?

