USA: భారత మహిళను ఆపి ఆశీర్వదించమని కాళ్ల మీద పడ్డారు.. కట్ చేస్తే..
అమెరికాలో భారతీయులపై దాడులే కాదు.. వారిని నిలువు దోపిడీ చేస్తున్నారు కేటుగాళ్లు.. దీనికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ వార్త ఇది.. ఓసారి విజువల్ చూస్తే ఏం జరిగిందనే విషయంపై మీకు క్లారిటీ వస్తుంది...
భారతీయులమంటూ ఓ మహిళను మాటల్లో దించారు. మాయమాటలతో ఏమార్చారు. ఆశీర్వదించాలంటూ నాటకమాడారు. ఓ ప్లాస్టిక్ కవర్‌లో గాజులు ఇస్తూ మీ ప్రేమ కావాలంటూ నమ్మబలికారు. పాపం.. అంతా నిజమేనని నమ్మిందా బాధితురాలు. ఇంకేముంది? ఆశీర్వదించేలోపే మెడలోని బంగారు గొలుసుతో ఉడాయించిందా జంట. ఈ ఘటన అమెరికా టెక్సాస్‌లోని ఫ్రిస్కో సిటీలో జరిగింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళను కారులో వచ్చిన జంట ఆపి మరీ మాయమాటలతో గొలుసు ఎత్తుకెళ్లడం హాట్‌టాపిక్‌గా మారింది. బంగారు గొలుసు స్నాచింగ్‌పై బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
కాగా టెక్సాస్ నగరంలో ఈ తరహా నగల దొంగతనాలు పెరిగాయని.. అపరిచితుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని స్థానిక పోలీస్ డిపార్ట్‌మెంట్ హెచ్చిరక జారీ చేసింది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
Published on: Oct 24, 2024 01:39 PM