చూపు కోల్పోయిన 9 మంది.. వికటించిన కంటి వైద్యం
ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కాటరాక్ట్ సర్జరీ చేయించుకున్న 30 మందిలో 18 మందికి ఇన్ఫెక్షన్ సోకింది. తొమ్మిది మంది రోగుల కళ్ళు తొలగించగా, మరో తొమ్మిది మంది చూపు కోల్పోయారు. వైద్య నిర్లక్ష్యం కారణంగా ఈ దారుణం జరిగిందని, అధికారులు ఆసుపత్రిని సీజ్ చేసి, దర్యాప్తు చేస్తున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా అధికారులు తెలిపారు.
ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. కంటి వైద్య శిబిరంలో కాటరాక్ట్ సర్జరీ చేయించుకున్న వారి జీవితాల్లో చీకటి మిగిలింది. గోరఖ్‌పూర్ లో 30 మందికి డాక్టర్లు కాటరాక్ట్ సర్జరీ చేయగా వారిలో 18 మందికి ఇన్ఫెక్షన్ సోకింది. తప్పనిసరి పరిస్థితుల్లో వేర్వేరు ఆస్పత్రుల్లో వైద్యులు తొమ్మిది మంది రోగుల కళ్లను తొలగించారు. మరో తొమ్మిది మంది కంటి చూపు కోల్పోయారు. శస్త్ర చికిత్స విధానంలో నిర్లక్ష్యంగా వ్యవహరించింది గోరఖ్‌పూర్‌లోని న్యూ రాజేశ్ హైటెక్ హాస్పిటల్. సీఎం యోగి ఆదేశాలతో అధికారులు ఆస్పత్రిని సీజ్‌చేసారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధ్యులైన వైద్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా మేజిస్ట్రేట్ దీపక్ మీనా తెలిపారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఘటన జరిగినట్లు తేలితే వాళ్ల లైసెన్స్‌లు రద్దుచేస్తామనీ దర్యాప్తు నివేదిక కోసం వేచిచూస్తున్నట్లు అన్నారు. 18 మంది బాధితులందరి ‘కల్చర్’రిపోర్ట్‌లను ప్రభుత్వ వైద్యులు చూశారు. అందరికీ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ సోకినట్లు నిర్ధారించారు. ఆయుష్మాన్ భారత్ పథకం వర్తిస్తుందనే ఆశతో దాదాపు 30 మంది ఒకేసారి కాటరాక్ట్ సర్జరీ చేయించుకున్నట్లు తెలిసింది. ఇన్‌ఫెక్షన్ సోకిన 18 మందికి ఆపరేషన్ అయిన 24 గంటల తర్వాత కంటి నుంచి రక్తం ధారగా కారడం, విపరీతమైన నొప్పిరావడంతో అధికారులు వారిని ఢిల్లీ, లక్నో, వారణాసి ఆస్పత్రుల్లో చేర్పించారు. ఇన్ఫెక్షన్ తీవ్రం కావడంతో తప్పని పరిస్థితుల్లో కళ్లను తొలగించాల్సి వచ్చిందని వేర్వేరు ఆస్పత్రుల వైద్యులు వివరణ ఇచ్చారు. వారణాసిలో తమ అమ్మకు ఒక కంటిని తొలగించారనీ మరో కంటికి కూడా ఇన్ఫెక్షన్ సోకిందేమోనని భయంగా ఉందనీ బాధితురాలి కుమారుడు ఆగ్రహం వ్యక్తం చేసాడు. రెండో కన్నూ సరిగా కనిపించడం లేదని తన తల్లికి జరగకూడనిది ఏదైనా జరిగితే ఆస్పత్రిపై కేసు వేస్తానని మీడియాకు తెలిపాడు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
శ్రీశైలం మల్లన్నకు కాసుల వర్షం..13 రోజుల్లోనే ఏకంగా..
పెళ్లి కూతురిపై నోట్ల వర్షం.. రూ. 8.5 కోట్లు వెదజల్లిన ఫ్యామిలీ!
తను కూర్చున్న కొమ్మనే నరుక్కున్నాడు.. చివరికి..
రైతు ఇంట సిరులు కురిపిస్తున్న పంట !! అధిక దిగుబడితో సంతోషం
Goli Soda: సింగరేణి కార్మికుల ఆరోగ్య రహస్యం.. అసలుసిసలు గోలీ సోడా చేసే మేలు తెలుసా ??
