గాలివాన బీభత్సం..నేలరాలిన మామిడి..
మండువేసవిలో అకాల వర్షాలు ఉత్తరాంధ్ర రైతులను తీవ్రంగా దెబ్బతీశాయి. ఉమ్మడి శ్రీకాకుళం, కాకినాడ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలకు మామిడి, అరటి, ధాన్యం పంటలు నేలరాలాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడి, రోడ్లపై చెట్లు కూలడంతో జనజీవనం స్తంభించింది. రైతులు ప్రభుత్వ ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
మండవేసవిలో కురుస్తున్న అకాల వర్షాలు ఉత్తరాంధ్ర రైతన్నలకు శాపంగా మారాయి. ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో వాతావరణం మారి, గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు ఎండవేడిమి నుండి ఉపశమనం కలిగించినా, శుక్రవారం సాయంత్రం వీచిన తీవ్ర ఈదురుగాలులు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రైతులకు భారీ నష్టాన్ని మిగిల్చాయి. పాలకొండ, వీరఘట్టం, భూర్జ, ఆమదాలవలస మండలాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. చెట్లు విరిగి రోడ్లపై పడటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సుమారు 20 విద్యుత్ స్తంభాలు ధ్వంసం కావడంతో పలు గ్రామాలు అర్ధరాత్రి వరకు చీకట్లోనే ఉండిపోయాయి. విద్యుత్ శాఖ సిబ్బంది పునరుద్ధరణ పనులు చేపట్టారు.ముఖ్యంగా మామిడి రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. చేతికి వచ్చిన పంట గాలుల ధాటికి నేలరాలింది. లక్షల రూపాయలు వెచ్చించి తోటలను లీజుకు తీసుకున్న రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారీగా పంట నష్టం వాటిల్లడంతో ప్రభుత్వం తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
పూరీ, సురేందర్ రెడ్డి కెరీర్‌ను నిలబెట్టేదెవరు..?