Viral Video: వామ్మో.. ఈ అంకుల్ డ్యాన్స్ చూస్తే మతిపోవాల్సిందే.. నెట్టింటిని ఊపేస్తోన్న వైరల్ వీడియో..

|

Apr 26, 2022 | 7:10 AM

డ్యాన్సింగ్ కాప్ పేరుతో దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఇండోర్ ట్రాఫిక్ పోలీస్ జవాన్ కున్వర్ రంజిత్ సింగ్ అంటే ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ పోలీస్ ట్రాఫిక్ డ్యూటీలో భాగంగా తన ప్రత్యేకమైన డ్యాన్స్ స్టైల్‌కు పేరుగాంచాడు.

Viral Video: వామ్మో.. ఈ అంకుల్ డ్యాన్స్ చూస్తే మతిపోవాల్సిందే.. నెట్టింటిని ఊపేస్తోన్న వైరల్ వీడియో..
Uncle Viral Dance
Follow us on

డ్యాన్సింగ్ కాప్ పేరుతో దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఇండోర్ ట్రాఫిక్ పోలీస్ జవాన్ కున్వర్ రంజిత్ సింగ్ అంటే ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ పోలీస్ ట్రాఫిక్ డ్యూటీలో భాగంగా తన ప్రత్యేకమైన డ్యాన్స్ స్టైల్‌కు పేరుగాంచాడు. అతడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వచ్చినప్పుడల్లా విపరీతంగా వైరల్ అవుతుంది. తాజాగా అతడికి సంబంధించిన ఓ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతోంది. ఇందులో డ్యాన్ చేసేది మాత్రం ఆయనదు కాదు. ఓ అంకుల్ ఈ ట్రాఫిక్ పోలీస్ ముందు అదరగొట్టే డ్యాన్స్‌తో తన సత్తా చూపించాడు. పోలీస్‌తోపాటు చుట్టుపక్కల ఉన్న జనాలంత కూడా ఈ అంకుల్ డ్యాన్స్‌కు ఫిదా అయ్యారు. ఆయనతోపాటు కాలు కదిపారు.

ఇండోర్‌కి చెందిన ప్రముఖ డ్యాన్స్ కాప్ కున్వర్ రంజిత్ సింగ్ ముందు కూల్‌గా డ్యాన్స్ చేస్తున్న అంకుల్‌ను మీరు వీడియోలో చూడొచ్చు. అతని ఈ వీడియో పబ్లిక్ పోలీసింగ్‌కు ఒక చక్కని ఉదాహరణగా నిలిచింది. ఈ వీడియో చూసిన నెజిటన్లు అంకుల్ డ్యాన్స్‌కు ఫ్యాన్స్ అయిపోతున్నారు. ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా తప్పకుండా ఫిదా అవుతారనడంలో సందేహం లేదు.

ఈ వీడియోను ఐపీఎస్ దీపాంశు కబ్రా ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఇలాంటి వీడియోలు పబ్లిక్ పోలీసుల స్నేహానికి అందమైన ఉదాహరణలు అంటూ క్యాఫ్షన్ అందించారు. వార్తలు రాసే సమయానికి 14 వేలకు పైగా వీక్షణలు వచ్చాయి. ఈ క్లిప్‌ను చూసిన తర్వాత నెటిజన్లు తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు.

‘అంకుల్ జీ అద్భుతమైన నృత్యాలు చేశారం’ అని ఒక యూజర్ కామెంట్ చేయగా, ‘అక్కడ పోలీసులు ఒకరితో ఒకరు నృత్యం చేస్తున్నారంటూ మరో యూజర్ తన అభిప్రాయాన్ని పంచుకన్నాడు.

ఇలాంటి వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: Viral Video: ఇదెక్కడి ఫోటోగ్రఫీరా అయ్యా.. బుడ్డోడి ఫీట్స్ చూస్తే మైండ్ బ్లాంక్ అవడం ఖాయం..

Digital TOP 9 NEWS: ఏలియన్స్‌కు సైంటిస్టులు లేఖ..జేసీబీతో ఏటీఎంను ధ్వంసం చేసిన దొంగలు