మిస్టర్ రైట్’ దొరకలేదని తనను తానే పెళ్లి చేసుకున్న మహిళ
పెళ్లి చేసుకోవాలనుకునే అమ్మాయికి భాగస్వామిపై అంచనాలు ఉండటం సహజం. అయితే కొందరి అంచనాలు త్వరగా నెరవేరుతాయి. మరికొందరికి ఎక్కువ కాలం పడుతుంది. ‘మిస్టర్ రైట్’ కోసం లండన్‌లో ఓ మహిళ ఎదురుచూసి విసిగిపోయి చివరకు తనను తానే పెళ్లి చేసుకుంది. ఈ వివాహానికి రూ. 10 లక్షలు ఖర్చు చేసింది. తన ఆదర్శ వివాహం కోసం ప్రతినెలా తాను పెట్టుకున్న పొదుపు మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టింది.
పెళ్లి చేసుకోవాలనుకునే అమ్మాయికి భాగస్వామిపై అంచనాలు ఉండటం సహజం. అయితే కొందరి అంచనాలు త్వరగా నెరవేరుతాయి. మరికొందరికి ఎక్కువ కాలం పడుతుంది. ‘మిస్టర్ రైట్’ కోసం లండన్‌లో ఓ మహిళ ఎదురుచూసి విసిగిపోయి చివరకు తనను తానే పెళ్లి చేసుకుంది. ఈ వివాహానికి రూ. 10 లక్షలు ఖర్చు చేసింది. తన ఆదర్శ వివాహం కోసం ప్రతినెలా తాను పెట్టుకున్న పొదుపు మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టింది. ఆమె పేరు సారా విల్కిన్సన్ వయసు 42 ఏళ్లు. ఇలా తన పెళ్లిని ఘనంగా నిర్వహించాలనే కోరికను ఆమె నెరవేర్చుకుంది. సారా తనను తాను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు, ఆమె నిశ్చితార్థపు ఉంగరాన్ని కొనుగోలు చేసింది. ఆ తర్వాత పెళ్లికి సిద్ధమైంది. ఆమె సఫోల్క్‌లోని హార్వెస్ట్ హౌస్‌లో స్నేహితులతో కలిసి తన పెళ్లి రోజును ప్రత్యేకంగా జరుపుకుంది. ఈ సందర్బంగా సారా మాట్లాడుతూ.. పెళ్లి రోజున తన భాగస్వామి తన పక్కన లేకున్నా పెళ్లి చేసుకోవాలన్న కోరికను ఎందుకు వదిలేసుకోవాలని ప్రశ్నించింది. అందుకే తను పెళ్లి కోసం ఆదా చేసిన డబ్బుతో వివాహం చేసుకున్నట్లు సారా చెప్పింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పులస చేప చిక్కిందోచ్ !! ధర చూసి ఎగిరి గంతేసిన జాలరి
మియాపూర్ లో 27 కేజీల బంగారం.. 16 కేజీల వెండి పట్టివేత
చిన్నారి నిద్రపోతున్న ఊయలపై నాగుపాము.. ఏం జరిగిందంటే ??
ఈ ఆఫీసర్ మహా స్ట్రిక్ట్.. పని పూర్తయ్యే వరకూ ఆహారం కూడా ముట్టడు..
లుంగీ కట్టుకొని జిమ్‌లో వర్కవుట్స్ ఇరగదీస్తున్న 85 ఏళ్ల వృద్ధుడు