25 నిమిషాలు ఆగి మళ్లీ కొట్టుకున్న గుండె !! ఏదో అద్భుతం జరిగిందన్న వైద్యులు

Updated on: Aug 06, 2024 | 9:17 PM

అమెరికాలో ఓ బ్రిటన్ విద్యార్థికి ఆపరేషన్‌ చేస్తుండగా ఏకంగా 25 నిమిషాల పాటు గుండె ఆగిపోయింది. అయినా మత్యుంజయుడై బయటపడి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. చార్లీ విన్సెంట్.. న్యూ హాంప్‌షైర్‌లోని సమ్మర్‌ క్యాంప్‌లో కానోయింగ్ బోధకుడిగా పనిచేస్తున్నాడు. ఆ రోజు అధిక సూర్యరశ్మి అతని కాళ్లపై పడి కాలిన గాయాల బారిన పడ్డాడు. అయితే అతడు దీన్నేం పట్టించుకోకుండా పనిచేస్తూనే ఉన్నాడు. వడదెబ్బకు గురై ఆస్పత్రి పాలయ్యాడు.

అమెరికాలో ఓ బ్రిటన్ విద్యార్థికి ఆపరేషన్‌ చేస్తుండగా ఏకంగా 25 నిమిషాల పాటు గుండె ఆగిపోయింది. అయినా మత్యుంజయుడై బయటపడి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. చార్లీ విన్సెంట్.. న్యూ హాంప్‌షైర్‌లోని సమ్మర్‌ క్యాంప్‌లో కానోయింగ్ బోధకుడిగా పనిచేస్తున్నాడు. ఆ రోజు అధిక సూర్యరశ్మి అతని కాళ్లపై పడి కాలిన గాయాల బారిన పడ్డాడు. అయితే అతడు దీన్నేం పట్టించుకోకుండా పనిచేస్తూనే ఉన్నాడు. వడదెబ్బకు గురై ఆస్పత్రి పాలయ్యాడు. వైద్య పరీక్షలో అతడికి న్యుమోనియా కూడా ఉన్నట్లు నిర్థారించారు. దీంతో అతడికి అత్యవసర శస్త్రచికిత్స నిర్వహించారు. ఆ క్రమంలో అతడికి స్ట్రోక్‌ రావడంతో ఏకంగా 25 నిమిషాల పాటు గుండె ఆగిపోయింది. వైద్యులు సైతం పరిస్థితి చేయి దాటిందనే అనుకున్నారు. ఆశ్చర్యకరంగా అతడి గుండె యథాస్థితికి వచ్చి పని చేయడం ప్రారంభించింది. ఈ రికవరీని వైద్యులు అద్భుతంగా అభివర్ణించారు. అయితే గుండె సాధారణం కంటే ఎక్కువగా పనిచేయాల్సి ఉంటుందనీ దీనిని కార్డియోmegaly అని పిలుస్తారని వైద్యులు అన్నారు. దాంతో ఈ 20 ఏళ్ల యువకుడిని దాదాపు ఏడు రోజుల పాటు కోమాలో ఉంచి చికిత్స అందించారు. మొదట్లో వైద్యులు భయపడ్డారు. ఎందుకంటే ఆ వ్యక్తికి గుండె, మూత్రపిండాల మార్పిడి అవసరమవ్వడంతో బతికే అవకాశాలు తక్కువని భావించారు వైద్యులు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

టైప్ 1, టైప్ 2 డయాబెటిస్‌ను పోలిన లక్షణాలు

చైనా కుటిల బుద్ధి.. బ్రహ్మపుత్రపై జలవిద్యుత్‌ కేంద్రం

Srisailam: శ్రీశైలం డ్యాం దగ్గర కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్

KTR: ‘బలగం’ చిత్ర బృందానికి కేటీఆర్ అభినందనలు..

Loading...
Unable to load recommendations.
Follow Us