స్టోర్ రూంలో వింత శబ్దాలు వెళ్లి చూసిన ఇంటి యజమాని గుండె గుభేల్!
విశాఖపట్నం వడ్లపూడిలోని ఓ ఇంటి స్టోర్‌రూమ్‌లో ఒకటి కాదు, రెండు భారీ కొండచిలువలు కనిపించి కలకలం రేపాయి. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ నాగరాజు చాకచక్యంగా రెండింటినీ సురక్షితంగా పట్టుకుని అటవీ ప్రాంతానికి తరలించారు. 12 అడుగులు, 9 అడుగుల పొడవున్న ఈ కొండచిలువల రెస్క్యూ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వర్షాకాలం ప్రారంభమైంది.. ఈ నేపథ్యంలో పాములు, కొండచిలువలు సంచారం పెరిగింది. వనాల్లో ఉండాల్సిన పాములు జనావాసాల్లోకి వచ్చేస్తూ భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా విశాఖపట్నం వడ్లపూడి పరిధిలో ఒకే ఇంట్లో రెండు భారీ కొండచిలువలు కలకలం సృష్టించాయి. వడ్లపూడి గ్రామ నివాసి అయిన కిశోర్ అనే వ్యక్తి ఇంట్టోని స్టోర్ రూమ్‌లో ఒక భారీ కొండచిలువ నక్కి ఉండడాన్ని గమనించిన కుటుంబ సభ్యులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వెంటనే వారు ప్రముఖ స్నేక్ క్యాచర్ నాగరాజుకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్ నాగరాజు కొండచిలువను పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. అయితే ఇక్కడే ఒక అసలైన ట్విస్ట్ ఎదురైంది. స్టోర్ రూమ్‌లో ఉన్న ఆ కొండచిలువను అత్యంత చాకచక్యంగా పట్టుకునే క్రమంలో.. దాని పక్కనే మరో భారీ కొండచిలువ కూడా ఉండడం చూసి అందరూ షాకయ్యారు. ఒకదాని కోసం వెళ్తే.. మరొకటి కూడా ప్రత్యక్షం కావడంతో కాసేపు అక్కడ ఉత్కంఠ నెలకొంది. అయినా సరే ఏమాత్రం బెదరకుండా స్నేక్ క్యాచర్ నాగరాజు తన నైపుణ్యంతో ఆ రెండు కొండచిలువలను సురక్షితంగా రెస్క్యూ చేశారు. వీటిలో ఒక కొండచిలువ ఏకంగా 12 అడుగులు పొడవుంటే.. మరొకటి 9 అడుగుల పొడవు ఉన్నట్లు గుర్తించారు. ఈ రెండు కొండచిలువలను పట్టుకుని సురక్షిత ప్రాంతానికి తరలించడంతో.. కిశోర్ కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఈ రెండు కొండచిలువల రెస్క్యూ వీడియోలు స్థానికంగా వైరల్ అవుతున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Bullet Train: హైదరాబాద్ – బెంగళూరు బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ పనులు షురూ!
Maharashtra: గుండెను పిండేసే ఘటన పొలం దున్నేందుకు కాడెద్దుగా మారిన యువకుడు
