మీ ఇంట సిరులు కురిపించే మొక్క! ఈ రోజులు, దిశలో నాటాలి గుర్తుంచుకోండి

Updated on: Aug 16, 2026 | 5:06 PM

హిందూ సంప్రదాయంలో తులసి మొక్కకు ప్రత్యేక స్థానం ఉంది. లక్ష్మీ స్వరూపంగా భావించే తులసిని ఇంట్లో సరైన దిశలో పెంచడం శుభప్రదమని నమ్ముతారు. పౌర్ణమి, మంగళ, గురు, శుక్రవారాల్లో తులసి నాటడం మంచిదని, ఏకాదశి, శని, ఆదివారం, అష్టమి రోజుల్లో నాటకూడదని సంప్రదాయ విశ్వాసం. ఈశాన్య దిశలో తులసి పెంచడం, ప్రతిరోజూ దీపం వెలిగించడం శుభఫలితాలను ఇస్తాయని నమ్ముతారు. ఇవన్నీ ఆధ్యాత్మిక, వాస్తు విశ్వాసాల ఆధారిత సూచనలు మాత్రమే.

హిందూ సంప్రదాయంలో తులసి మొక్కకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ మొక్కను లక్ష్మీ స్వరూపంగా భావించి పూజిస్తారు. శ్రీకృష్ణుడు సైతం ఒక్క తులసీదళం సమర్పిస్తే సంతుష్టుడవుతాడని చెబుతారు. అలాంటి తులసి మొక్క ఇంటి ఆవరణలో ఉంటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని పెద్దలు, పండితులు చెబుతారు. సంపదకు దేవత అయిన లక్ష్మి.. తులసి మొక్కలో నివసిస్తుందని నమ్ముతారు. అందువల్ల, ఇంట్లో తులసి మొక్కలను నాటడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని విశ్వసిస్తారు. అలాగే ఈ తులసి మొక్కను ఎప్పుడంటే అప్పుడు నాటకూడదని చెబుతారు. ఈ మొక్కను నాటేందుకు కొన్ని నిర్ధిష్ట సమయాలు ఉంటాయి. అవేంటో చూద్దాం. ప్రధానంగా రెండు రకాల తులసి మొక్కలు ఉంటాయి. రామ తులసి, కృష్ణ తులసి. కానీ మనకు లభించే ప్రయోజనాలు… ఇంటి స్థానం ఇంకా తులసిని ఎంత జాగ్రత్తగా చూసుకుంటారు అనే దానిపై ఆధారపడి ఉంటాయి. కాబట్టి, తులసిని సరైన దిశలో మాత్రమే పెంచాలి. కొన్ని నిర్దిష్ట రోజులలో ఇంట్లో తులసి మొక్కలు ఉండటం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. కొన్ని సమయాల్లో పొరపాటున కూడా తులసిని నాటకూడదంటారు. అలా చేయడం వల్ల ఆ వ్యక్తికి హాని కలుగుతుందని చెబుతారు. తులసి మొక్క ఇంటికి సానుకూల శక్తిని తెస్తుంది. పౌర్ణమి రోజు, మంగళ, గురు,శుక్రవారాల్లో ఇంట్లో తులసి మొక్కలు నాటడం వల్ల చాలా శుభ ఫలితాలు వస్తాయని నమ్ముతారు. ఇలా చేయడం వల్ల ఇంటికి ఆనందం, శాంతి మరియు ఆర్థిక పురోగతి వస్తుంది. అలాగే.. ఏకాదశి, శనివారం, ఆదివారం మరియు అష్టమి రోజులలో తులసి మొక్క నాటడం నిషిద్ధమని భావిస్తారు. అలా చేయడం వల్ల ఆ వ్యక్తి ఇల్లు, జీవితంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. లక్ష్మీదేవి కోపానికి గురవుతారని, జీవితంలో అనేక సమస్యలు, కష్టాలను ఎదుర్కోవలసి వస్తుందని చెబుతారు. ప్రధానంగా ఆర్థిక ఇబ్బందులకు కారణమవుతాయి. తులసిని ప్రత్యేకమైన రోజును మాత్రమే నాటాలని చెబుతారు. అలాగే తులసి మొక్కను ఈశాన్య దిశలో నాటడం మంచిది. ఇది సాధ్యం కాకపోతే, ఉత్తరం లేదా తూర్పు దిశలలో తులసి మొక్కను నాటవచ్చు. అలాగే, ప్రతిరోజూ తులసి మొక్కకు దీపం వెలిగించడం మంచిదని భావిస్తారు. ఇది లక్ష్మీదేవి ఆశీస్సులను పొందడంలో సహాయపడుతుంది. నిపుణులు ప్రకారం.. తులసి మొక్క వద్ద రూపాయి నాణెంను పాతిపెట్టడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోతాయని చెబుతారు. శని, రాహువు ప్రభావాన్ని తగ్గిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య తరచుగా గొడవలు ఉంటే, తులసి మొక్క నేలలో ఒక రూపాయి నాణెంను పాతిపెట్టడం ప్రయోజనకరంగా ఉంటుంది. తులసిని సానుకూల శక్తికి చిహ్నంగా భావిస్తారు. అందువల్ల, తులసి మొక్క వద్ద ఒక నాణెంను పాతిపెట్టడం వల్ల కుటుంబ కలహాలు తగ్గుతాయి. ఇంట్లో శాంతి లభిస్తుంది. కుటుంబంలో అకాల మరణాలను నివారిస్తుంది. తులసికి సంబంధించిన ఏదైనా పరిహారాన్ని స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించిన తర్వాత మాత్రమే చేయాలి. గురువారం లేదా శుక్రవారం తులసి మొక్క వద్ద నాణెం పాతిపెట్టడం మంచిది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వాహనదారులకు షాక్.. వితంతువులు, అనాథల పేరుతో కొత్త సెస్!

ఆర్థిక సలహాల కోసం ఏఐని వాడుతున్నారా? అయితే ఈ డేంజర్ బెల్స్ మోగినట్టే!

వర్షం వస్తే చాలు డబ్బే.. డబ్బు.. ఈ ఊరిలో కన్నీటిని మరిపించే అద్భుతం!

స్పోర్ట్స్ బ్యాగు తెరిచిన యువకుడు.. లోపలున్నది చూసి పరుగో పరుగు!

Loading...
Unable to load recommendations.
Follow Us