బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన డ్రైవర్, కండక్టర్.. ఆ తర్వాత
మేడ్చల్ డిపోకు చెందిన టీఎస్ఆర్టీసీ కండక్టర్ గోవింద్, డ్రైవర్ ఇస్మాయిల్ నిజాయితీ చాటుకున్నారు. బస్సులో ప్రయాణికుడు మరిచిపోయిన బ్యాగ్‌లో రూ.2 లక్షల నగదు, ఆపిల్ ల్యాప్‌టాప్, ఇతర విలువైన వస్తువులను గుర్తించి అధికారులకు అప్పగించారు. అనంతరం బ్యాగ్ యజమాని ప్రశాంత్‌ను సంప్రదించి సొత్తును సురక్షితంగా అందజేశారు. పోయిందనుకున్న విలువైన వస్తువులు తిరిగి దక్కడంతో ప్రయాణికుడు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. వారి నిజాయితీపై అధికారులు, ప్రయాణికులు ప్రశంసలు కురిపించారు.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మేడ్చల్ డిపోకు చెందిన కండక్టర్, డ్రైవర్లు తమ నిజాయితీతో ప్రయాణికుల మనసులు గెలుచుకున్నారు. బస్సులో పొరపాటున ప్రయాణికుడు వదిలేసిన రూ.2 లక్షల నగదు, విలువైన ల్యాప్‌టాప్ ఉన్న బ్యాగ్‌ను భద్రంగా బాధితుడికి అప్పగించి మానవత్వాన్ని చాటుకున్నారు. మేడ్చల్ డిపోకు చెందిన 215/2 నంబర్ బస్సు పటాన్‌చెరువు నుంచి సికింద్రాబాద్ మార్గంలో ప్రయాణిస్తోంది. కేపీహెచ్‌బీలో ప్రశాంత్ అనే యువకుడు బస్సు ఎక్కాడు. అతను ప్యాట్ని దగ్గర బస్సు దిగిపోయాడు. ఈ క్రమంలో అతను తన బ్యాగ్‌ను సీట్లోనే మరిచిపోయి బస్సు దిగి వెళ్లిపోయాడు. తిరుగు ప్రయాణంలో సీట్లో ఉన్న బ్యాగ్‌ను కండక్టర్ గోవింద్ గుర్తించారు. డ్రైవర్ ఇస్మాయిల్‌తో కలిసి విషయాన్ని వెంటనే డిపో అసిస్టెంట్ మేనేజర్ రామారావు, విజిలెన్స్ అధికారులకు సమాచారం అందించారు. అధికారుల సమక్షంలో బ్యాగ్ తెరవగా అందులో రూ.2 లక్షల నగదు, ఆపిల్ ల్యాప్‌టాప్, ఆఫీస్ ఐడీ కార్డు, నంబర్ లభించాయి. వెంటనే అధికారులు బాధితుడు ప్రశాంత్‌కు సమాచారం అందించి డిపోకు పిలిపించారు. రూ.2 లక్షల నగదుతో పాటు ఆపిల్ ల్యాప్‌టాప్, చార్జర్, ఇతర వస్తువులను సరి చూసి అందించారు. పోయిందనుకున్న తన విలువైన సొత్తు దక్కడంతో ప్రయాణికుడు ఆనందం వ్యక్తం చేస్తూ కండక్టర్ గోవింద్, డ్రైవర్ ఇస్మాయిల్, అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అల్లు అర్జున్ X షారూఖ్ ఖాన్? కానీ ఊహించని ట్విస్ట్ ఉంది!
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
రేషన్ షాపులో బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. పరిశీలించి షాక్ తిన్న యజమాని
