Water Falls: పచ్చటి అడవిలో అద్భుతమైన జల దృశ్యం.! భూతాల స్వర్గమే..
ఏటా వర్షాకాలం వచ్చిందంటే చాలు అడవి మొత్తం పచ్చదనం పరుచుకుంటుంది. అలాంటి అడవిలో ఉండే ఎత్తైన కొండల పై నుండి వర్షపు నీరు జాలువారుతుంటే ఆ చుట్టు ఉన్న ప్రాంతం అంతా ఆహ్లాదంగా మారిపోతుంది. వర్షాకాలం మొదలవడంతో ఆ జలపాతాలు వయ్యారాలతో పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ఎందుకంటే పచ్చదనంతో పాటు , ఎత్తైన కొండల నడుమ ఉండే జలపాతాలను ఒక్కసారైనా వీక్షించాలి అని కచ్చితంగా అనిపిస్తుంది.
ఏటా వర్షాకాలం వచ్చిందంటే చాలు అడవి మొత్తం పచ్చదనం పరుచుకుంటుంది. అలాంటి అడవిలో ఉండే ఎత్తైన కొండల పై నుండి వర్షపు నీరు జాలువారుతుంటే ఆ చుట్టు ఉన్న ప్రాంతం అంతా ఆహ్లాదంగా మారిపోతుంది. వర్షాకాలం మొదలవడంతో ఆ జలపాతాలు వయ్యారాలతో పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ఎందుకంటే పచ్చదనంతో పాటు , ఎత్తైన కొండల నడుమ ఉండే జలపాతాలను ఒక్కసారైనా వీక్షించాలి అని కచ్చితంగా అనిపిస్తుంది. పెద్దపల్లి జిల్లాలో దట్టమైన అడవిలో ప్రకృతి అందాలు కనువిందు చేస్తున్నాయి. దీనికి నిదర్శనం ఈ జల దృశ్యం. శ్రావణ మాసంలో జలపాతం దగ్గర సందడి చేస్తూ, ఎంజాయ్ చేస్తున్నారు పర్యాటకులు. కాల్వ శ్రీరాంపూర్ మండలం జాఫర్ ఖాన్ పేట గ్రామ సమీపంలోని పాండవలంక జలపాతం దగ్గరకు పర్యాటకులు క్యూ కట్టారు. వర్షాలకు గుట్టపై నుంచి నీరు వస్తోంది. సందర్శకులను ఈ దృశ్యం ఆకట్టుకుంటోంది. వీకెండ్‌లో పర్యాటకులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. పాండవులు వనవాసం చేసినప్పుడు ఈ ప్రాంతంలో కొద్ది రోజులు గడిపారట.. అందుకే ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చిందని నానుడి. ఏటా శ్రావణమాసం, వర్షాకాలం నేపథ్యంలో ఈ ప్రాంతంలో గుట్టపై నుండి నీరు రావడంతో ఈ సుందర దృశ్యాన్ని తిలకించేందుకు పర్యాటకులు క్యూ కడతారు. అయితే ఈ ప్రాంతానికి సరైన రోడ్డు, రవాణా సదుపాయం లేకపోవడంతో పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు వేయాలని కోరుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.