
Viral Video: టోక్యో ఒలింపిక్స్ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. కొందరు విజయం సాధించి పతకాలు సాధిస్తే.. మరికొందరు పరాజితులవుతున్నారు. అయితే నిన్న జరిగిన మహిళల స్విమ్మింగ్ 400 మీటర్ల ఫ్రీస్టయిల్ పోటీల్లో ఓ సన్నివేశం ఆకట్టుకుంది. పోటీల్లో పాల్గొన్న క్రీడాకారిణి గెలిచిందని.. ఆమె కోచ్ చేసిన సందడి నెట్టింట్లో తెగ వైరలవుతోంది. వివరాల్లోకి వెళ్తే.. ఆస్ట్రేలియాకు చెందిన అరియార్ని టిట్మస్ స్విమ్మింగ్ 400 మీటర్ల ఫ్రీస్టయిల్ పోటీల్లో పాల్గొంది. పోటీలు జరుగుతున్నాయి. ఆమె కోచ్ డీన్ బాక్సాల్ ఎంతో టెన్షన్‌తో మ్యాచ్‌ను చూస్తున్నాడు. చివరికి ఆమె బంగారు పతకం గెలిచింది. టిట్మస్ ఫినిషింగ్ లైన్ తాకగానే.. ఆమె కోచ్ సంతోషాన్ని ఆపుకోలేకపోయాడు. పూనకం వచ్చినవాడిలా చిందులు వేశాడు. ఆనందం కట్టలు తెంచుకుని ఊగిపోయాడు. దీంతో పక్కన ఉన్న ఒలింపిక్ ఉద్యోగి భయపడిపోయిందంటేనే.. కోచ్ చేసిన హాడావుడి ఎలా ఉందో తెలుసుకోవచ్చు. ఎక్కడ గ్యాలరీ నుంచి కిందికి దూకేస్తాడేమోనని ఆమె అడ్డుపడింది.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జాస్ బట్లర్ అనే యూజర్ ఈ వీడియోను తన ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం 11.5k వ్యూస్‌తో దూసుకపోతోంది. అలాగే 401 కామెంట్లు చేశారు. 2.8k సార్లు రీ ట్వీట్ చేశారు.
Also Read: Viral Video: బర్గర్ కోసం అలిగిన బుడ్డోడు.. నవ్వులు పూయిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్
Viral Video: మురికినీటితో ప్లేట్లను కడుగుతున్న వ్యాపారి.. వీడియో చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే.!