టీవీ స్క్రీన్‌పై కనిపించిన పెద్ద పులి.. భయంతో ఆ వ్యక్తి చేసిన పనికి నెటిజన్లు షాక్‌ !!

| Edited By: Ram Naramaneni

Jan 25, 2023 | 10:17 AM

కొందరు హారర్ సినిమా చూసేటప్పుడు భయపడటం సహజమే. కానీ టీవీలో జంతువును చూసి భయపడి టీవీని పగలగొట్టిన ఘటన గురించి మీరు ఎప్పుడైనా విన్నారా?. వినడానికి వింతగా అనిపించినప్పటికీ..

కొందరు హారర్ సినిమా చూసేటప్పుడు భయపడటం సహజమే. కానీ టీవీలో జంతువును చూసి భయపడి టీవీని పగలగొట్టిన ఘటన గురించి మీరు ఎప్పుడైనా విన్నారా?. వినడానికి వింతగా అనిపించినప్పటికీ.. ఇది నిజంగా జరిగింది. వైరల్ అవుతున్న వీడియోలో.. ఇద్దరు వ్యక్తులు టీవీ చూస్తున్నారు. ఇంతలో టీవీలో పులి కనిపించింది. దాంతో టీవీ చూస్తున్న ఓ వ్యక్తి భయపడిపోయాడు. వెంటనే పులిని కొట్టాలనే ఉద్దేశంతో పెద్ద కర్రను తీసుకొని టీవీని బలంగా కొట్టాడు. దీంతో టీవీ పగిలిపోయింది. ఈ క్లిప్ చూశాక మొదట్లో నవ్వాలనిపించినా.. మరుసటి క్షణమే అతని పిచ్చి చేష్టకు చిర్రెత్తుకొస్తుంది. ఈ వీడియో ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ అయింది. వీడియో చూసిన తర్వాత నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఇది కావాలాని చేసినట్లు తెలుస్తోందని కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

విమానంలో బుడ్డోడు చేసిన పనికి అందరూ ఫిదా !! సోషల్ మీడియాలో వైరల్ చిన్నారి వీడియో

వాహనాలతో వెరైటీ రెస్టారెంట్‌.. వెళితే వాహ్వా అనాల్సిందే..

Follow us on