Viral Video: అప్పుడే పుట్టిన పసికందుల కేరింతల మధ్యే హాహాకారాలు..! హృదయాలను కదిలిస్తున్న ఆసుపత్రుల్లో దృశ్యాలివి..!
అప్పుడే పుట్టిన పసికందుల కేరింతల మధ్య .. గాయాలతో సైనికుల ఆర్తనాదాలు ఉక్రెయిన్ ఆసుపత్రుల్లో మారుమోగుతున్నాయి. ప్రసవ వేదనలు, మరణయాతనలు కలిసి విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. ఓ ప్రసూతి ఆసుపత్రి బేస్‌మెంటులో తాజా పరిస్థితి ఇది! రష్యా సేనల దాడుల్లో
అప్పుడే పుట్టిన పసికందుల కేరింతల మధ్య .. గాయాలతో సైనికుల ఆర్తనాదాలు ఉక్రెయిన్ ఆసుపత్రుల్లో మారుమోగుతున్నాయి. ప్రసవ వేదనలు, మరణయాతనలు కలిసి విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. ఓ ప్రసూతి ఆసుపత్రి బేస్‌మెంటులో తాజా పరిస్థితి ఇది! రష్యా సేనల దాడుల్లో గాయపడిన వారిని ఇక్కడికి తరలిస్తున్నారు. క్షతగాత్రులకు పైఅంతస్తులో అత్యవసర చికిత్సలు అందిస్తున్నారు. దీంతో ప్రసూతి వార్డును బేస్‌మెంట్‌కు తరలించారు. యుద్ధ సమయంలో ప్రసవించాల్సి రావడంతో గర్భిణులు చెప్పలేని బాధలు పడుతున్నారు. ‘‘ఇలాంటి పరిస్థితుల్లో బిడ్డకు జన్మనిస్తాననుకోలేదు. చాలా ఆందోళన పడ్డాను. గాయపడ్డ వారికి చికిత్స అందిస్తూ డాక్టర్లంతా చాలా బిజీగా ఉన్నారు. అయినప్పటికీ, వారు నాకెంతో సాయం చేశారు. వారికి నేనెప్పుడూ రుణపడి ఉంటాను’’ అని బేస్‌మెంట్‌లో ప్రసవించిన 30 ఏళ్ల మహిళ చెప్పారు. ఖర్కివ్‌లోని మరో ప్రసూతి ఆసుపత్రి వైద్యులు కూడా.. నవజాత శిశువులను, గాయపడ్డ సైనికులను బేస్‌మెంట్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
మరిన్ని చూడండి ఇక్కడ:
Sitara Ghattamaneni: మహేశ్ తనయ క్యూట్ స్టిల్స్.. అప్పుడే యాక్టింగ్ మొదలెట్టిందా..!
Pragya Jaiswal: ప్రగ్యా జైస్వాల్ ఇంత అందమా..! మెస్మరైజ్ చేస్తున్న ప్రగ్యా లేటెస్ట్ ఫొటోస్..
