Viral Video: వీడు అసలు కొడుకేనా.. ఏం చేశాడో తెలిస్తే ఛీ అంటారు..
డబ్బుమీద వ్యామోహంతో విచక్షణ కల్పోయాడో వ్యక్తి. ఆస్తి కోసం కన్నతండ్రినే చంపాలని చూశాడు. స్కూటీ మీద వెళ్తున్న తండ్రిని వెనుక నుంచి కారుతో ఢీకొట్టడంతో బాధితుడు తీవ్ర గాయాలపాలై కోమాలోకి వెళ్లిపోయాడు.
డబ్బుమీద వ్యామోహంతో విచక్షణ కల్పోయాడో వ్యక్తి. ఆస్తి కోసం కన్నతండ్రినే చంపాలని చూశాడు. స్కూటీ మీద వెళ్తున్న తండ్రిని వెనుక నుంచి కారుతో ఢీకొట్టడంతో బాధితుడు తీవ్ర గాయాలపాలై కోమాలోకి వెళ్లిపోయాడు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు కొడుకే తండ్రిని చంపేందుకు ప్రయత్నించాడని నిర్ధారించి అరెస్ట్ చేశారు. అన్నమయ్య జిల్లా పీలేరులో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పీలేరుకు చెందిన చంద్రశేఖర్ రెడ్డికి ఇద్దరు భార్యలు. పెద్ద భార్యకు ఇద్దరు కొడుకులు, చిన్న భార్యకు పిల్లలు లేరు. అయితే ఇద్దరు కొడుకుల్లో పెద్దవాడు చనిపోవడంతో ఆస్తి కావాలంటూ చిన్న కొడుకు లక్ష్మీ ప్రసాద్ రెడ్డి పట్టుబట్టాడు. దీంతో సగం ఆస్తిని కొడుక్కి రాసిచ్చాడు. ఆ తర్వాత రెండో భార్య తమ్ముడి దగ్గర చంద్రశేఖర్ వుంటున్నాడు. దీంతో మిగిలిన సగం ఆస్తిని అతనికి రాసిస్తాడేమోనన్న అనుమానంతో తండ్రిని చంపేందుకు ప్రయత్నించాడు.పక్కా ప్లాన్ ప్రకారం.. స్కూటీ మీద వెళ్తున్న తండ్రిని కారుతో ఢీకొట్టాడు. తీవ్ర గాయాలైనప్పటికీ ఆయన ప్రాణాలతో బయటపడ్డాడు. మొదట ఇది యాక్సిడెంట్ అనుకున్నారు. కానీ అనుమానం రావడంతో చంద్రశేఖర్ రెడ్డి బావమరిది పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొడుకు లక్ష్మీ ప్రసాద్ రెడ్డే తండ్రిని చంపేందుకు ప్రయత్నించాడని విచారణలో తేలింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sorry: పుణ్యం కోసం రామకోటి రాస్తారు.. మరీ సారీ కోటి ఏంటో..? గోడలు, మెట్లు, చెట్టు, కొమ్మ అంతటా సారీ, సారీ..
Rashmika Mandanna: క్రష్మిక క్రష్ ఎవరో చెప్పేసింది.. స్కూల్ డేస్ నుంచి అతనంటే చాలా ఇష్టం..!
Man dies in hotel: హోటల్‌లో ప్రేయసితో శృంగారం చేస్తూ వ్యక్తి మృతి.. ఏం జరిగిందంటే..?
Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్..!