Viral Video: అవును.. ఆమెకు రెండు నాలుకలు.. వైరల్‌ అవుతున్న షాకింగ్‌ వీడియో.

Updated on: Sep 25, 2023 | 9:15 AM

అదేంటి? పాముకి కదా రెండు నాలుకలు ఉండేది.. మనిషికి ఎలా సాధ్యం? అనుకుంటున్నారా? టెక్నాలజీ యుగంలో అసాధ్యం అనుకున్నవెన్నో సుసాధ్యం చేసేస్తున్నారు. మనిషి తనను తాను కొన్ని సందర్భాలనుంచి తప్పించుకోడానికి ఎటు వీలైతే అటు మాట్లాడుతుంటాడు. అలాంటి వారికి రెండు నాలుకలు ఉన్నాయని కామెంట్‌ చేయడం వింటూ ఉంటాం. కానీ ఇక్కడ ఓ మహిళకు నిజంగానే రెండు నాలుకలు ఉన్నాయి.

అదేంటి? పాముకి కదా రెండు నాలుకలు ఉండేది.. మనిషికి ఎలా సాధ్యం? అనుకుంటున్నారా? టెక్నాలజీ యుగంలో అసాధ్యం అనుకున్నవెన్నో సుసాధ్యం చేసేస్తున్నారు. మనిషి తనను తాను కొన్ని సందర్భాలనుంచి తప్పించుకోడానికి ఎటు వీలైతే అటు మాట్లాడుతుంటాడు. అలాంటి వారికి రెండు నాలుకలు ఉన్నాయని కామెంట్‌ చేయడం వింటూ ఉంటాం. కానీ ఇక్కడ ఓ మహిళకు నిజంగానే రెండు నాలుకలు ఉన్నాయి. ఆమె తన రెండు నాలుకలను చూపిస్తూ ఓ వీడియోను తన సోషల్‌ మీడియా ఖాతా టిక్‌టాక్‌లో పోస్ట్‌ చేసింది. ఆ వీడియో చూసిన నెటిజన్లు ఇదెలా సాధ్యం అని ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ మహిళ నూడుల్స్ తింటోంది. అందులో వింతేముందు అనుకోకండి. ఆమె నూడుల్స్‌ తినే తీరు చూస్తే మీరు కళ్లు తిరగడం ఖాయం. ఆమె ఫోర్క్‌తో నూడుల్స్‌ తీసుకొని వాటిని తినేందుకు నాలుకను బయటకు తీసింది. అప్పుడు ఆమ నోటినుంచి రెండు నాలుకలు బయటకు వచ్చాయి. అవి రెండూ నూడుల్స్‌ను చుట్టి లోపలికి తీసుకుంటున్నాయి. లాడ్‌బైబిల్‌ (Ladbible) అనే వెబ్‌సైట్ ప్రకారం.. ఈ యువతి ప్రత్యేకమైన ఆపరేషన్‌ చేయించుకుని కుట్లు వేయించుకుంది. నాలికను ఇలా రెండుగా కట్ చేసే ప్రక్రియ తాను ఊహించిన దానికంటే చాలా సులభంగా అయిపోయిందని, కేవలం 15 నిమిషాలు మాత్రమే పట్టిందని ఆమె చెప్పింది. ఆపరేషన్ తర్వాత తన నోటి నుండి లాలాజలం వరదలా ప్రవహించడం ప్రారంభించిందని,నాలుకకు వాపు వచ్చిందని తెలిపింది. నొప్పి, వాపు తగ్గడానికి 24 గంటల సమయం పట్టిందని తెలిపింది. కానీ ఇప్పటికీ తన దంతాలు లాగుతున్నట్లు ఫీల్ అవుతున్నానని.. నోరు మూసుకునే సమయంలో కొంత సమస్య ఏర్పడుతుందని పేర్కొంది. తినడానికి, త్రాగడానికి మాత్రం ఎలాంటి లేదని వివరించింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..