Lions Viral: ప్రాణభయంతో సింహంలు పరుగులు.! వీడియో వైరల్.. ఏం జరిగిందంటే.?

|

Dec 14, 2023 | 9:47 AM

సింహం అంటే అడవికి రాజు.. సింహాన్ని చూసి అన్ని జంతువులూ భయపడతాయి. సింహం గర్జన వింటేనే ఎక్కడి జంతువులక్కడ గప్‌చుప్‌గా ఉండిపోతాయి. అలాంటిది ఓ సింహం మరో జంతువును చూసి ప్రాణ భయంతో పరుగులు తీసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. సింహం కూడా భయపడుతుందా అంటూ కామెంట్లు చేస్తున్నారు. నెట్టింట వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో..

సింహం అంటే అడవికి రాజు.. సింహాన్ని చూసి అన్ని జంతువులూ భయపడతాయి. సింహం గర్జన వింటేనే ఎక్కడి జంతువులక్కడ గప్‌చుప్‌గా ఉండిపోతాయి. అలాంటిది ఓ సింహం మరో జంతువును చూసి ప్రాణ భయంతో పరుగులు తీసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. సింహం కూడా భయపడుతుందా అంటూ కామెంట్లు చేస్తున్నారు. నెట్టింట వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో.. రెండు ఖడ్గ మృగాలు అడవిలో నడుచుకుంటూ వెళ్తున్నాయి. ఆ దారిలో రెండు సింహాలు అడ్డంగా పడుకొని ఉన్నాయి. మంచి నిద్రలో ఉన్న ఆ సింహాలకు ఏదో జంతువు వస్తున్న అలికిడి వినపడింది. అవి ఎక్కడ తమపై దాడి చేస్తాయోనని భయపడిన సింహాలు ఒక్కసారిగా నిద్రలోంచి లేచి నిలబడ్డాయి. మరుక్షణం ఎదురుగా ఉన్నఖడ్గమృగాలను చూసి సింహాలు భయంతో పక్కకు తొలగిపోయి.. వాటికి దారిచ్చాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు అడవికి రాజు ఎవరు? అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. సింహం వెనుదిరిగి నడిచే దృశ్యాన్ని పలువురు ఎగతాళి చేస్తున్నారు. అడవికి సింహాన్ని రాజుగా ఎవరు ప్రకటించారు.? అది తప్పు అంటున్నారు. రకరకాల ఫన్నీ కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.