Viral Video: స్టంట్‌ చేయబోయి మూతి పగలగొట్టుకున్నాడు.. ఏం చేశాడో చూడండి.

|

Jun 27, 2023 | 8:15 AM

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఓ అద్భుత సన్నివేశం. అందుకే తమ పెళ్లిని గ్రాండ్‌గా జరుపుకోవాలని వధూవరులు, తన ఫ్రెండ్ పెళ్లిలో హడావిడి చేయాలని స్నేహితులు ఉవ్విళ్లూరుతుంటారు. అందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో చాలానే ఉన్నాయి.

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఓ అద్భుత సన్నివేశం. అందుకే తమ పెళ్లిని గ్రాండ్‌గా జరుపుకోవాలని వధూవరులు, తన ఫ్రెండ్ పెళ్లిలో హడావిడి చేయాలని స్నేహితులు ఉవ్విళ్లూరుతుంటారు. అందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో చాలానే ఉన్నాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. వీడియోలో ఫ్రెండ్ పెళ్లికి గిఫ్ట్‌తో వెళ్లిన ఓ వ్యక్తి.. వధూవరుల ముందు ఫ్లిప్ చేసి బహుమతి ఇవ్వాలనుకున్నాడు, కానీ ఫ్లిప్ చేయడంలో ఫెయిల్ అయ్యాడు. స్టంట్‌ చేయబోయి అదుపుతప్పి బోర్లాపడ్డాడు. ఇక అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా ఫక్కున నవ్వారు. ఏంచేయాలో తెలియక గిఫ్ట్‌ని ఫ్రెండ్ చేతిలో పెట్టి అక్కడ నుంచి వెళ్లిపోయాడు సదరు వ్యక్తి.

అందుకు సంబంధించిన వీడియో ఓ యూజర్‌ తన ఇన్‌స్టా ఖాతా నుంచి షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను దాదాపు 60 వేలమంది వీక్షించారు. 5 వేలమంది లైక్‌చేసారు. ఇక ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘నిరుత్సాహ పడకు సోదరా.. ఫ్లిప్ చేసేవరకు అక్కడే ప్రయత్నించు’ అని ఓ నెటిజన్ రాసుకురాగా.. ‘అంత అవసరం ఏముందిరా బాబు’ అని మరో వ్యక్తి కామెంట్ చేశాడు. ఇలా పలువురు నెటిజన్లు వీడియోపై తమ స్పందనలను కామెంట్ సెక్షన్‌లో తెలియజేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌..