Cat Eating Food: ఫుడ్‌ను చూసిన పిల్లి సంతోషం మామూలుగా లేదుగా.. క్యూట్ వీడియో.!

Updated on: Oct 08, 2022 | 8:40 AM

తాజాగా ఓ పిల్లి తమ అందమైన చర్యలతో హృదయాలను గెలుచుకుంటుంది. ప్రస్తుతం ఇంటర్నెట్‌లో పిల్లికి సంబంధించిన వీడియో చాలా వేగంగా వైరల్ అవుతోంది.


ఇంట్లో పెంపుడు జంతువులు ఉంటే ఆ సందడే వేరు. కుటుంబసభ్యుల్లా కలిసిపోయి అవి చేసే అల్లరి, హంగామా అంతా ఇంతా కాదు. కలిసి తినడం, కలిసి నిద్రపోవడం, చిన్న చిన్న పనులు చేయడం వంటి చర్యలతో అందరినీ ఆకట్టుకుంటాయి. అయితే సోషల్ మీడియా వాడుకలోకి ఇవి చేసే అల్లరి అందరికీ తెలుస్తోంది. వీటిని పెంచుకునే యజమానులు అల్లరి పనులను వీడియో తీసి ఇంటర్నెట్ లో పోస్ట్ చేస్తున్నారు. వీటిలో కొన్ని చాలా ఫన్నీగా ఉంటాయి. తాజాగా ఓ పిల్లి తమ అందమైన చర్యలతో హృదయాలను గెలుచుకుంటుంది. ప్రస్తుతం ఇంటర్నెట్‌లో పిల్లికి సంబంధించిన వీడియో చాలా వేగంగా వైరల్ అవుతోంది. పిల్లి తన ఆహారాన్ని చూసి చాలా సంతోషించి ఆనందంతో గంతులేయడం ప్రారంభిస్తుంది. పిల్లికి ఫుడ్ పెడుతున్న సమయంలో ఆ ఇంటి యజమాని సౌండ్ చేశాడు. అంతే పిల్లి ఎగిరి గంతేసింది. సంతోషం పట్టలేక ఆనందంతో వెంటనే చెంగు చెంగున ఎగురుతూ డ్యాన్స్ చేస్తుంది. చివరలో బేబీ క్యాట్ బౌల్ లో ఉన్న ఫుడ్ ను తినే విధానం చూస్తే నవ్వు ఆగడం లేదు. ఈ వీడియోను సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేశారు. ఈ పిల్లి ఎక్స్ ప్రెషన్స్ చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Boys rent for girls: అమ్మాయిల కోసం అద్దెకు అబ్బాయిలు.! గంటకు ఇంత లెక్కన కిరాయికి బాయ్‌ ఫ్రెండ్‌..

Snake acting: అబ్బా ఎం యాక్టింగ్ గురు..! ఈ పాము స్టార్‌ హీరోలను మించిపోయిందిగా.. ఆస్కార్‌ ఇవ్వాల్సిందే

Published on: Oct 08, 2022 08:40 AM
Follow Us