Viral Video: వరుడు దగ్గర కట్నం తీసుకుని ప్రియుడితో వధువు జంప్‌.. లబోదిబో మంటున్న వరుడు(వీడియో)..

Updated on: Sep 21, 2021 | 9:36 PM

పెళ్లయిన మరుక్షణమే భర్తను వదిలి ప్రియుడితో ఉడాయించింది ఓ నవ వధువు. పెళ్లి సందర్భంగా వరుడు వధువుకి కొంత డబ్బు, బంగారం కట్నంగా ఇచ్చాడు. అవి చేతికందగానే భర్త కళ్లు గప్పి ప్రియుడితో పారిపోయింది. మోసపోయానని తెలుసుకున్న వరుడు నెత్తీనోరూ బాదుకుంటున్నాడు.

పెళ్లయిన మరుక్షణమే భర్తను వదిలి ప్రియుడితో ఉడాయించింది ఓ నవ వధువు. పెళ్లి సందర్భంగా వరుడు వధువుకి కొంత డబ్బు, బంగారం కట్నంగా ఇచ్చాడు. అవి చేతికందగానే భర్త కళ్లు గప్పి ప్రియుడితో పారిపోయింది. మోసపోయానని తెలుసుకున్న వరుడు నెత్తీనోరూ బాదుకుంటున్నాడు. బెంగళూరుకు చెందిన మహమ్మద్‌ ఇలియాస్‌ – హైదరాబాద్‌ పాతబస్తీకి చెందిన సమ్రిన్‌ బేగంకి పెళ్లి నిశ్చయమైంది. సెప్టెంబర్‌ 18న హైదరాబాద్‌ బాలాపూర్‌లోని ఓ ఇంట్లో పెళ్లి జరిగింది. పెళ్లి సందర్భంగా ఇలియాస్‌, సమ్రిన్‌ బేగంకి రెండు లక్షల విలువైన బంగారం, 50 వేల రూపాయలు క్యాష్‌ ఇచ్చాడు. పెళ్లి తంతు పూర్తయింది. అంతా ఓకే అనుకుంటున్న సమయంలో పెళ్లికూతురు మేనత్త, చిన్నమ్మ వచ్చి సమ్రిన్‌ను పార్లర్‌కు తీసుకువెళ్తున్నామని చెప్పి బయటకు తీసుకెళ్లారు. మళ్లీ తిరిగి రాలేదు.

పార్లర్‌కు వెళ్తున్నామని చెప్పి తీసుకెళ్లిన సమ్రిన్‌ను, ఆమె ప్రియుడివెంట పంపించేశారు. ఆమెతోపాటు పెళ్లికొడుకు ఇచ్చిన నగదు, బంగారం తీసుకొని ప్రియుడితో వెళ్లిపోయింది సమ్రిన్‌. ఎంతసేపటికి పెళ్లికూతురు తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన పెళ్లికొడుకు పెళ్లికూతురు మేనమామలను నిలదీశాడు. దాంతో వారు నీళ్లు నమిలారు. మోసపోయానని గ్రహించిన మహమ్మద్‌ ఇలియాస్‌ పెళ్లికూతురికి అతను ఇచ్చిన డబ్బు, బంగారం తిరిగి ఇవ్వకపోతే పోలీసులకు అప్పగిస్తానని సమ్రిన్‌ మేనమామలను హెచ్చరించాడు. దాంతో తమకు కొంత గడువు ఇమ్మని, అన్నీ సెటిల్‌ చేస్తామని చెప్పడంతో వరుడు శాంతించాడు.
మరిన్ని చదవండి ఇక్కడ : Tollywood Drugs Case Video: డ్రగ్స్‌ కేసులో తనీశ్‌ చిక్కేనా..? టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కొత్త మలుపు(వీడియో)…

 Prabhas, Rajamouli Video: బాహుబలి రిపీట్… ప్రభాస్‌, రాజమౌళి కాంబోలో మరో సినిమా.. (వీడియో)

 Ek Number News Live Video: చచ్చిపోయిన రోజే మళ్ళా పుట్టిన కవలలు | కండ్ల నీళ్లు పెట్టుకున్న సోనూసూద్‌.(వీడియో)

 Big News Big Debate Live Video: వైట్‌ ఛాలెంజ్‌లు.. రాజకీయ మంటలు… (లైవ్ వీడియో)

Loading...
Unable to load recommendations.
Follow Us