సర్పంచ్ బరిలో అతని ఇద్దరు భార్యలు.. చివరికి ట్విస్ట్ అదిరింది
సిద్దిపేట జిల్లా జంగంపల్లి సర్పంచ్ ఎన్నిక అనూహ్య మలుపు తిరిగింది. ఒకే వ్యక్తి ఇద్దరు భార్యలు, అక్కాచెల్లెళ్లు అయిన లావణ్య, రజిత నామినేషన్లు దాఖలు చేశారు. చివరికి రజిత ఉపసంహరించుకోవడంతో, లావణ్య సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో పాటు 10 వార్డులు కూడా ఏకగ్రీవమయ్యాయి. ఈ ప్రత్యేక ఎన్నిక కథ సుఖాంతమైంది.
తెలంగాణ సర్పంచ్ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. పోలింగ్ సమీపిస్తుండటంతో ఊహించని ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా అటువంటి ఘటన సిద్దిపేట జిల్లా అక్బర్‌పేట–భూంపల్లి మండలం జంగంపల్లి గ్రామంలో వెలుగు చూసింది. జంగపల్లి సర్పంచ్ పదవికి నర్సింహారెడ్డి ఇద్దరు భార్యలు లావణ్య, రజిత నామినేషన్లు దాఖలు చేశారు. వీరిద్దరూ ఒకే కుటుంబానికి చెందిన అక్కాచెల్లెళ్లు కూడా. అయితే.. తొలుత ఉత్కంఠ రేపిన ఈ గ్రామ సర్పంచ్ ఎన్నిక అంశం.. శనివారం రజిత తన నామినేషన్ ఉపసంహరించుకోవటంతో.. ఆమె సోదరి లావణ్య ఏకగ్రీవంగా సర్పంచ్‌గా గెలిచింది. ఈ పంచాయతీ పరిధిలోని 10 వార్డులు కూడా ఏకగ్రీవమయ్యాయి. జంగపల్లి సర్పంచ్ పదవి జనరల్ మహిళకు రిజర్వ్ అయింది. అయితే నామినేషన్ల ప్రక్రియలో భాగంగా.. నర్సింహారెడ్డి.. తన ఇద్దరు భార్యలతో నామినేషన్ దాఖలు చేయించారు. నవంబర్ 30వ తేదీన మొదటి భార్యతో నామినేషన్ వేయించారు. ఆ తర్వాత తప్పులుంటే తొలగిస్తారు అన్న భయంతో రెండవ భార్యతోను నామినేషన్ దాఖలు చేయించారు. నామినేషన్ల దాఖలు ముగిసే టైంకి ఆ గ్రామంలో ఇతరులెవరు నామినేషన్లను దాఖలు చేయలేదు. దీంతో పోటీలో ఆ ఇద్దరే మిగిలారు. ఇద్దరు భార్యలు బాగా చదువుకున్న వారే.. ఇద్దరిలో ఒకరు నామినేషన్ ను ఉపసంహరించుకుంటే సర్పంచ్ పదవి ఏకగ్రీవం అవుతుంది. అయితే ఇద్దరిలో ఎవరి నామినేషన్ ఉపసంహరించుకుంటారు. భర్త ఎవరికి మద్దతిస్తారు అనే అంశం రెండు, మూడు రోజులుగా ఆసక్తిగా మారింది. భర్త ఒకరికి మద్దతిచ్చి, ఒకరిని వద్దంటే రెండో భార్య ఊరుకుంటుందా? ఇద్దరు భార్యలతో సుఖంగా సాగుతున్న సంసారం.. సర్పంచ్ ఎన్నిక వల్ల ఆగం కానుందా? అంటూ గ్రామంలో చర్చ మొదలైంది. ఇద్దరిలో ఒకరు నామినేషన్ ఉపసంహరించుకుంటే సర్పంచ్ పదవి ఏకగ్రీవం అవుతుంది. ఈ నేపథ్యంలో మొదట నామినేషన్ దాఖలు చేసిన లావణ్యకు మద్దతునిస్తూ.. నర్సింహారెడ్డి రెండవభార్య రజిత పెద్ద మనుసు చేసుకుని నామినేషన్ ఉపసంహరించుకుంది. దీంతో ఈ ఎన్నిక ఏకగ్రీవం కాగా, ఈ మొత్తం కథ సుఖాంతం అయింది. లేదంటే ఇరువురి సతుల మధ్య సర్పంచ్ పోరులో పతి ఏమయ్యేవాడో పాపం అంటూ జనం చర్చించుకుంటున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పర్వతంపైకి తీసుకెళ్లి ప్రియురాలిని వదిలేసిన ప్రియుడు.. చలికి గడ్డ కట్టి..
రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ.. కానీ అంతలోనే ఇలా..
ప్రాణాలు తీసిన ప్రీ వెడ్డింగ్ షూట్.. నవ జంట దుర్మరణం
TOP 9 ET News: ఖండ-2 రిలీజ్ డేట్ ఫిక్స్? గెట్ రెడీ
Rajasekhar: రాజశేఖర్‌కు షూటింగ్ లో ప్రమాదం.. డి కాలికి తీవ్ర గాయం
