గుడ్‌ న్యూస్‌.. ఇక పురుషులకూ ఫ్రీ బస్‌ సదుపాయం

Updated on: Oct 04, 2026 | 10:14 PM

తెలంగాణలో మహిళలకు అమలవుతున్న ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యాన్ని వయోవృద్ధులకు కూడా విస్తరించే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. ప్రస్తుతం మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణం అందుతోంది. వృద్ధులకు ప్రత్యేక ఉచిత బస్సు పాస్‌లు జారీ చేసే అంశంపై చర్చలు జరుగుతున్నాయి. వయోపరిమితి, అర్హతలు, నిబంధనలు ఖరారు చేసిన తర్వాతే ఈ ప్రతిపాదన అమలుపై ప్రభుత్వం అధికారిక నిర్ణయం తీసుకోనుంది.

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం విజయవంతంగా కొనసాగుతున్న ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని మరింత విస్తరించడానికి వేగంగా సన్నాహాలు చేస్తోంది. ఇప్పటివరకు కేవలం మహిళలకు మాత్రమే పరిమితమైన ఈ ఉచిత బస్సు సౌకర్యాన్ని, ఇకపై వయోవృద్ధులకు కూడా వర్తింపజేయాలని యోచిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ‘మహాలక్ష్మి’ పథకం కింద పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆధార్ కార్డు చూపిస్తే ప్రయాణించే ఈ వెసులుబాటు ద్వారా నిత్యం లక్షలాది మంది మహిళలు లబ్ధి పొందుతున్నారు. కాగా, సీనియర్ సిటిజన్లకు కూడా ఉచిత బస్సు పాస్‌లు జారీ చేసే ప్రతిపాదనను సీరియస్‌గా పరిశీలిస్తున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే మహిళలతో పాటు పురుషుల్లోని వయోవృద్ధులకు కూడా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి రానుంది. అర్హులైన సీనియర్ సిటిజన్లు అందరికీ ప్రత్యేక ఉచిత పాస్‌లు అందించి, వాటి ద్వారా ఛార్జీలు లేకుండా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించనున్నారు. వయో పరిమితి, ఇతర విధివిధానాలు, నిబంధనలు ఖరారు చేసే పనిలో ప్రభుత్వం నిమగ్నమై ఉంది. ప్రస్తుతం ఈ పథకం చర్చలు, పరిశీలన దశలోనే ఉన్నందున విధివిధానాలు పూర్తయిన తర్వాత ఎప్పటి నుంచి అమలు చేస్తారనే విషయాన్ని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించనుంది. వృద్ధులకు రవాణా ఖర్చుల భారాన్ని తగ్గించేలా రాబోతున్న ఈ నిర్ణయంపై రాష్ట్రవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆ ఆలయంలో అంతుచిక్కని దైవ రహస్యం..

గుడ్‌న్యూస్‌.. హెచ్-1బి వీసాలపై లక్ష డాలర్ల ఫీజుకు బ్రేక్

గుడ్‌న్యూస్‌.. ఆర్టీసీ, మెట్రో ఉమ్మడి పాస్ వచ్చేసింది.. రోజువారీ, నెలవారీ ధరలివే!

ప్రయాణికుడి దుస్సాహసం.. టేకాఫ్‌కు ముందు ఎమర్జెన్సీ డోర్‌ తెరిచేందుకు యత్నం!

పంటను కాపాడుకోబోయి.. ప్రాణాలే కోల్పోయారు!

Loading...
Unable to load recommendations.
Follow Us