ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. కట్ చేస్తే తెల్లారే సరికి పోలీస్ స్టేషన్ లో

Updated on: Feb 26, 2026 | 6:30 PM

జగిత్యాల జిల్లాలో ఓ ప్రేమ వివాహ జంట కుల బహిష్కరణకు గురైంది. కులాంతర వివాహం చేసుకున్నారన్న నెపంతో గ్రామ పెద్దలు వారిని సామాజికంగా ఒంటరిని చేశారు. దీంతో బాధితులు న్యాయం చేయాలని అధికారులను ఆశ్రయించారు. కుల బహిష్కరణలు చట్టరీత్యా నేరమని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. ఈ అన్యాయంపై అధికారులు విచారణ చేపట్టారు.

ఆధునిక సమాజంలో ఆదర్శంగా నిలవాల్సిన ప్రేమ వివాహం.. ఆ దంపతుల పాలిట శాపంగా మారింది. కులాంతర వివాహం చేసుకున్నారన్న నెపంతో గ్రామ పెద్దలు వారిని కుల బహిష్కరణ చేసి, సామాజికంగా ఒంటరిని చేశారు. దీంతో ఆ ప్రేమ జంట తమకు న్యాయం చేయాలంటూ అధికారులను ఆశ్రయించింది. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దొంతపూర్ గ్రామానికి చెందిన పసుల సంగీత , బీర్పూర్ మండలం కోమనపల్లికి చెందిన బద్దీ పవన్ గత ఏడాది డిసెంబర్‌లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే, వీరి వివాహం అబ్బాయి తరపు కుల పెద్దలకు మింగుడుపడలేదు. దీంతో ఆగ్రహించిన పెద్దలు సదరు జంటను కులం నుండి బహిష్కరించడమే కాకుండా, గ్రామంలో జరిగే ఎలాంటి శుభ, అశుభ కార్యాలకు వారు రాకుండా ఆంక్షలు విధించారు. ఈ క్రమంలో తమను మానసికంగా కుంగదీస్తూ, సామాజిక స్వేచ్ఛను హరిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత నెలలో ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో, తాజాగా మరోసారి అధికారులను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. “తాము నేరం చేయలేదని, ఇష్టపడి పెళ్లి చేసుకున్నామని, అందరిలాగే గౌరవంగా బతికే అవకాశం తమకు కల్పించమంటూ వేడుకుంటున్నారు. బాధితుల ఫిర్యాదుపై స్పందించిన అధికారులు తక్షణమే విచారణకు ఆదేశించారు. రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛకు భిన్నంగా కుల బహిష్కరణలు చేయడం చట్టరీత్యా నేరమని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Vijay-Rashmika Marriage: విరోషి పెళ్లి వేడుకలో టాప్‌ 9 విశేషాలు..

ఏజెన్సీలో చీకటి వైద్యం.. సెల్‌ఫోన్‌ వెలుగుల్లో ప్రజల ప్రాణాలు

దారుణం.. 2 నెలల పసికందును పొయ్యిలో పడేసి..

Vijay-Rashmika Marriage: కొడవ సంప్రదాయంలో.. పెళ్లి చీర ఎలా కట్టుకుంటారంటే

Vijay-Rashmika Marriage: కొడవ సంప్రదాయంలో.. వరుడు ఎలాంటి దుస్తులను ధరించాలంటే

Loading...
Unable to load recommendations.
Follow Us