ఐఫోన్‌ కావాలన్న ప్రియురాలు.. మైనర్‌ ఏం చోరీ చేసాడంటే..

Updated on: Jun 09, 2026 | 5:43 PM

ప్రియురాలికి ఐఫోన్ కొనివ్వాలనే కోరికతో నాగ్‌పూర్‌కు చెందిన ఓ మైనర్ బాలుడు ఇద్దరు సహచరులతో కలిసి రూ.11.4 లక్షల విలువైన లగ్జరీ శానిటరీ వస్తువులను గిడ్డంగి నుంచి దొంగిలించాడు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు గంటల్లోనే కేసును ఛేదించి నిందితులను అరెస్ట్ చేశారు. ఈ ఘటన యువతపై సామాజిక ఒత్తిళ్ల ప్రభావాన్ని మరోసారి వెలుగులోకి తీసుకొచ్చింది.

ప్రేమ ఎంతటి పనైనా చేయిస్తుంది. ఎలాంటి వారినైనా మార్చేస్తుంది. ప్రేమకు ఉన్న శక్తి అటువంటిది. ఇటీవల కాలంలో ప్రేమ కోసం ప్రియురాలి కోసం దారుణాలు చేస్తున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. తన ప్రియురాలికి ఐఫోన్‌ కొనివ్వాలనే ఉద్దేశంతో ఓ మైనర్ బాలుడు ఏకంగా 11. 4 లక్షల రూపాయల విలువైన లగ్జరీ నల్లాలు , ఇతర వేర్ హౌస్ వస్తువులను దొంగిలించాడు. మరో ఇద్దరితో కలిసి అతడు ఈ చోరీ చేసాడు. మే 27-28 తేదీల మధ్య రాత్రి నాగ్‌పూర్‌లోని కలామ్నా ప్రాంతంలో ఓ కంపెనీ గిడ్డంగిలో ఈ చోరీ జరిగింది. ఇద్దరు మైనర్ బాలురు, 38 ఏళ్ల ఇర్ఫాన్ అలీ అనే వ్యక్తితో కలిసి గిడ్డంగి పైకప్పు రేకులను కత్తిరించి లోపలికి ప్రవేశించారు. అక్కడ ఉన్న ఖరీదైన డిజైనర్ ట్యాపులు, ఫాసెట్లు, ఇతర శానిటరీ వస్తువులను అపహరించారు. గిడ్డంగి యజమాని రాహుల్ జైచంద్ బాత్రా ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు, నగరవ్యాప్తంగా ఉన్న 25కు పైగా సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి నిందితులను గుర్తించారు. గంటల వ్యవధిలోనే కేసును ఛేదించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి చోరీ చేసిన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. విచారణలో, తమ గర్ల్‌ఫ్రెండ్ ఒత్తిడితో ఐఫోన్ కొనివ్వాలనే ఉద్దేశంతోనే ఈ దొంగతనానికి పాల్పడినట్లు ఒక బాలుడు అంగీకరించాడు. రూ. 11.40 లక్షల విలువైన ఈ వస్తువులను వారు అతి తక్కువ ధరకే స్థానిక పాత సామాను విక్రేతకు అమ్మేశారు. పోలీసులు చోరీకి గురైన సొత్తులో అధిక భాగాన్ని స్వాధీనం చేసుకుని, ఇద్దరు మైనర్లతో పాటు ఇర్ఫాన్ అలీని అరెస్ట్ చేశారు. ఇక ఈ వార్త విన్న వాళ్లంతా ప్రియురాలి కోసం దొంగతనానికి ఒడిగట్టారా? ఇదేం దారుణం అంటూ నోరెళ్ళబెడుతున్నారు. ప్రేమ కోసం ఏవేవో చేసారంటే విన్నాం కానీ దొంగతనం చేయడం ఇప్పుడే వింటున్నాం అంటూ పలువురు ఈ వార్త విని అవాక్కవుతున్నారు. యువతపై పెరుగుతున్న సామాజిక ఒత్తిళ్లు వారిని ఏ విధంగా నేరాల వైపు మళ్లిస్తున్నాయి అనడానికి ఈ ఘటన అద్దం పడుతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఎవరెస్ట్‌పై అద్భుతం..ఆరు రోజులు ఆహారం, ఆక్సిజన్ లేకున్నా బతికాడు!

బాస్ అంటే ఇతడే.. కంటతడి పెట్టిస్తున్న ఘటన!

పేపర్ చదివేలోపు.. స్కూటీ కొట్టేసిన దొంగ

అమ్మా.. ఇదిగో నా మొదటి జీతం.. తల్లిదండ్రుల రియాక్షన్‌ ఇదే!

మనుషుల పై ఏఐ తిరగబడనుందా? అచ్చం రోబో సినిమాలో చూపినట్లుగా…!

Follow Us