Teacher Protest: విద్యార్ధి ఇంటిముందు టీచర్‌ ధర్నా.. ఎందుకో తెలిస్తే నిజంగా షాక్ అవ్వాల్సిందే..!

Updated on: Dec 31, 2022 | 9:03 AM

ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థి పాఠశాలకు రాక భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నాడని గ్రహించిన ఉపాధ్యాయుడు.. విద్యార్థి భవిష్యత్తు కోసం పరితపించిన తీరు అందరిని ఆలోచింపజేసింది.


ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థి పాఠశాలకు రాక భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నాడని గ్రహించిన ఉపాధ్యాయుడు.. విద్యార్థి భవిష్యత్తు కోసం పరితపించిన తీరు అందరిని ఆలోచింపజేసింది. బెజ్జంకిలోని జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాలలో అదే గ్రామానికి చెందిన జేరిపోతుల నవీన్‌ పదో తరగతి చదువుతున్నాడు. నవీన్‌ పది రోజులుగా పాఠశాలకు రావడం లేదు. ఈ విషయం తెలుసుకున్న పాఠశాలలో ఇంగ్లీష్‌ టీచర్‌గా పనిచేసే టీచర్‌ బి.వి.ప్రవీణ్‌ రెడ్డి విద్యార్థి ఇంటికి వెళ్లి నవీన్‌ను పాఠశాలకు ఎందుకు పంపించడం లేదని తల్లిదండ్రులను అడిగారు. వారు పొంతనలేని సమాధానం చెప్పడంతో నవీన్‌ను పాఠశాలకు పంపించేంతవరకు కదిలేది లేదని విద్యార్థి ఇంటి ముందు బైఠాయించారు. చదువుకు దూరం చేసి విద్యార్ధి భవిష్యత్తు పాడుచేయొద్దని, తల్లిదండ్రులకు నచ్చజెప్పారు. చదువుతో కలిగే ప్రయోజనాలను తల్లిదండ్రులకు, విద్యార్థికి వివరించారు. దీంతో తల్లిదండ్రులు తమ కుమారుడ్ని ఉపాధ్యాయుడి వెంట పాఠశాలకు పంపించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Crocodile-drone: అబ్భాబ్భా ఎం వీడియో గురు.. తనను క్యాప్చర్‌ చేస్తున్న డ్రోన్‌ను మొసలి ఏం చేసిందో చూస్తే..

School childrens: స్కూల్‌ పిల్లల్లోకి ఆత్మలు.. తాంత్రికుడిని పిలిచి పూజలు నిర్వహణ.. ఎవరో తెలిస్తే షాకే.!

Car accident: డ్రైవర్‌ ర్యాష్‌ డ్రైవింగ్‌.. ప్రశ్నించినందుకు కారుతో ఢీకొట్టి.. నడిరోడ్డుపై దారుణంగా.. వీడియో.

 

Published on: Dec 31, 2022 09:03 AM
Loading...
Unable to load recommendations.
Follow Us