శ్రీశైలం మల్లన్నకు కాసుల వర్షం..13 రోజుల్లోనే ఏకంగా..

Updated on: Feb 21, 2026 | 12:00 PM

నంద్యాల శ్రీశైల మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు సమర్పించిన కానుకల లెక్కింపు పూర్తయ్యింది. 13 రోజుల్లో దేవస్థానానికి రూ. 5.61 కోట్లకు పైగా నగదు, 124.5 గ్రాముల బంగారం, 5.550 కిలోల వెండి లభించాయి. భారతీయ కరెన్సీతో పాటు అమెరికా డాలర్లు, ఇంగ్లాండ్ పౌండ్లు వంటి విదేశీ కరెన్సీలు కూడా సమకూరాయి. భక్తుల రద్దీతో ఆదాయం గణనీయంగా పెరిగిందని అధికారులు తెలిపారు.

నంద్యాల జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి చెంత భక్తులు తమ భక్తిని చాటుకున్నారు. ఇటీవల అత్యంత వైభవంగా జరిగిన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు పోటెత్తారు. ఈసందర్భంగా స్వామి,అమ్మవార్లకు సమర్పించిన కానుకల లెక్కింపును దేవస్థానం అధికారులు పూర్తి చేశారు. గత 13 రోజులకు గాను మల్లన్నకు భారీగా ఆదాయం లభించింది. చంద్రవతి కళ్యాణ మండపంలో కట్టుదిట్టమైన భద్రత, సీసీ కెమెరాల నిఘా మధ్య జరిగిన ఈ లెక్కింపులో స్వామివారికి రూ. 5,61,81,535 ల నగదు ఆదాయం వచ్చినట్లు దేవస్థానం చైర్మన్ రమేష్ నాయుడు, ఈవో శ్రీనివాసరావు అధికారికంగా ప్రకటించారు. నగదుతో పాటు భక్తులు మొక్కుల రూపంలో పెద్ద ఎత్తున బంగారు, వెండి ఆభరణాలను సమర్పించారు. స్వామి అమ్మవార్లకు కానుకగా 124.5 గ్రాముల బంగారం, 5.550 కేజీల వెండి సమకూరాయి. భారతీయ కరెన్సీతో పాటు విదేశాల్లోని భక్తులు కూడా స్వామివారిపై తమ భక్తిని చాటుకున్నారు. హుండీలో 22 అమెరికా డాలర్లు , 25 ఇంగ్లాండ్ పౌండ్లు, 15 ఆస్ట్రేలియా డాలర్లు, సింగపూర్ డాలర్లు, యూరోలతో పాటు యూఏఈ దిర్హమ్స్, ఒమన్ బైసా, మలేషియా రింగిట్స్ వంటి వివిధ దేశాల కరెన్సీలు లభించాయి. ఈ లెక్కింపు ప్రక్రియలో ఆలయ అధికారులు, పర్యవేక్షకులు, శివసేవకులు పాల్గొని అత్యంత పారదర్శకంగా నిర్వహించారు. భక్తుల రద్దీకి అనుగుణంగానే ఈసారి ఆదాయం గణనీయంగా పెరిగిందని అధికారులు తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పెళ్లి కూతురిపై నోట్ల వర్షం.. రూ. 8.5 కోట్లు వెదజల్లిన ఫ్యామిలీ!

తను కూర్చున్న కొమ్మనే నరుక్కున్నాడు.. చివరికి..

రైతు ఇంట సిరులు కురిపిస్తున్న పంట !! అధిక దిగుబడితో సంతోషం

Goli Soda: సింగరేణి కార్మికుల ఆరోగ్య రహస్యం.. అసలుసిసలు గోలీ సోడా చేసే మేలు తెలుసా ??

మోగనున్న పెళ్లి బాజాలు.. అత్యంత శుభ ముహూర్తాలు ఇవే

Follow Us