ఆటో డ్రైవర్‎కు కనిపించిన అదృశ్య శక్తి.. తవ్వకాలు జరిపి చూస్తే.. ఊరంతా పండుగే

|

Feb 12, 2024 | 8:27 PM

ఖమ్మం జిల్లాలోని ఓ గ్రామంలో దేవుడు వెలిశాడంటూ పెద్ద సంఖ్యలో గ్రామస్తులంతా చేరి పూజలు చేశారు. ఆటో డ్రైవర్‌ తన పని ముగించుకుని ఇంటికి వెళ్తున్న క్రమంలో చెట్ల పొదల్లో ఓ దేవుడు కనిపించాడంటూ గ్రామస్తులందరినీ తీసుకొచ్చి ఆ ప్రాంతంలో తవ్వకాలు జరిపాడు. అక్కడ దేవతా ప్రతిరూపాలు కలిగిన శిలలు చూసి గ్రామస్తులంతా పూజలు చేశారు. ముదిగొండ మండలం పెద్ద మండవ గ్రామానికి చెందిన బుద్ధారపు శ్రీనివాస్ అనే వ్యక్తి ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు.

ఖమ్మం జిల్లాలోని ఓ గ్రామంలో దేవుడు వెలిశాడంటూ పెద్ద సంఖ్యలో గ్రామస్తులంతా చేరి పూజలు చేశారు. ఆటో డ్రైవర్‌ తన పని ముగించుకుని ఇంటికి వెళ్తున్న క్రమంలో చెట్ల పొదల్లో ఓ దేవుడు కనిపించాడంటూ గ్రామస్తులందరినీ తీసుకొచ్చి ఆ ప్రాంతంలో తవ్వకాలు జరిపాడు. అక్కడ దేవతా ప్రతిరూపాలు కలిగిన శిలలు చూసి గ్రామస్తులంతా పూజలు చేశారు. ముదిగొండ మండలం పెద్ద మండవ గ్రామానికి చెందిన బుద్ధారపు శ్రీనివాస్ అనే వ్యక్తి ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఒక రోజు రాత్రి వేళ తన పని ముగించుకుని తిరిగి గ్రామానికి వస్తుండగా గ్రామ సమీపంలో రోడ్డు పక్కన ఉన్న పొదలో దేవుడు కనిపించినట్లు అనిపించడంతో గ్రామస్తులకు తెలిపాడు. గ్రామస్తులు నమ్మకపోవడంతో తానే స్వయంగా కొంతమంది గ్రామస్తులతో ముక్కోటి ఏకాదశి రోజున కొంత మేర తవ్వకాలు చేపట్టి వదిలివేశాడు. ఆనాటి నుంచి గ్రామంలో జరిగే కొన్ని శుభకార్యాలలో మహిళలకి ఉగ్రరూపంలో ఒంటిపైకి వచ్చి తాను అక్కడే ఉన్నానని, తనను ఎవరూ గుర్తించడం లేదని చెపుతుండటం తో గ్రామస్తులంతా చర్చించుకుని తవ్వకాలు జరిపేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కొడుకునంటూ తిరిగొచ్చిన సన్యాసి.. అసలు సన్యాసే కాదట

బాల రాముడి దివ్యమైన కనులను చెక్కింది వీటితోనే.. అరుణ్ యోగిరాజ్ పోస్ట్ వైరల్

TOP9 ET: మహేష్‌ సినిమా అంటే చులకనా.. ఫ్యాన్స్‌ సీరియస్ | ఒక్కొక్కరికీ ఇచ్చిపడేసిన డైరెక్టర్