Viral Video: పాముకు చుక్కలు చూపించిన ఎలుక.. తగ్గేదేలే అన్నట్లుగా గట్టి పోటీ.. వీడియో చూస్తే ఔరా అనాల్సిందే..

|

Apr 22, 2022 | 4:24 PM

జంతువులకు సంబంధించిన ఫన్నీ, ఆశ్చర్యకరమైన వీడియోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంటాయి. ఈ వీడియోలు చూసిన తర్వాత యూజర్లు తమ అద్భుతమైన కామెంట్లను కూడా పంచుకుంటుంటారు.

Viral Video: పాముకు చుక్కలు చూపించిన ఎలుక.. తగ్గేదేలే అన్నట్లుగా గట్టి పోటీ.. వీడియో చూస్తే ఔరా అనాల్సిందే..
Snake Viral Video
Follow us on

జంతువుల(Animals)కు సంబంధించిన ఫన్నీ(Funny Video), ఆశ్చర్యకరమైన వీడియోలు నెట్టింట్లో తెగ వైరల్(Viral) అవుతుంటాయి. ఈ వీడియోలు చూసిన తర్వాత యూజర్లు తమ అద్భుతమైన కామెంట్లను కూడా పంచుకుంటుంటారు. ఈ వీడియోలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటాయనడంలో సందేహం లేదు. ముఖ్యంగా అడవి జంతువులు పోరాడుతున్న ఫన్నీ వీడియోలు, సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన వెంటనే వైరల్‌గా మారతాయి. తాజాగా పాము, ఎలుకకు సంబంధించిన వీడియో ఒకటి తెరపైకి వచ్చింది. ఇందులో ఒక ఎలుక, ఒక విషసర్పానికి తగిన గుణపాఠం నేర్పింది. ఇది చూసిన తర్వాత మీరు కూడా కచ్చితంగా ఆశ్చర్యపోతారు.

పాములు అందుబాటులో ఉన్న దేనినైనా వేటాడగలవు. చాలా పాములు ఎలుకలు, ఉడుతలు లేదా పక్షులు వంటి చిన్న జంతువులను విషంతో బంధిస్తాయి లేదా చంపుతాయి. పెద్ద పాములు తరచుగా జింకలు, పందులు, కోతులు, ఇతర పెద్ద జంతువులను కూడా వేటాడతాయి. తాజాగా నెట్టింట్లో సందడి చేస్తోన్న వీడియో చూస్తే మాత్రం మీరు షాకవుతారు.

ఎలుక పాముతో పోరాడుతున్నట్లు వీడియోలో చూడొచ్చు. ఎలుక పాములకు అత్యంత సులభమైన ఆహారం. కానీ, ఎలుక పాముతో పోరాడుతూ చివరికి పాము ఆకలిని చెడగొట్టడం చూస్తే అందరూ ఆశ్చర్యపోతారు. వీడియో ప్రారంభంలో, పాము ఎలుకను భయపెట్టడానికి ప్రయత్నిస్తుంది. అయితే, ఎలుక భయపడే బదులు పామును ధైర్యంగానే ఎదుర్కొంటుంది. పాము దాడి చేస్తున్నప్పుడు దాని దెబ్బల నుంచి తనను తాను రక్షించుకుంటుంది. అదే టైంలో ఎలుక పాము మెడను కొరుకుతున్నట్లు కనిపిస్తుంది.

ఇన్‌స్టాగ్రామ్‌లో rasal_viper అనే ఖాతాతో వీడియో షేర్ చేశారు. ‘ఇది నిజంగా ఆశ్చర్యకరమైన వీడియో’ అంటూ ఓ యూజర్ కామెంట్ చేయగా, అదే సమయంలో, మరొక వినియోగదారు, ‘నిజంగా ఎలుక ధైర్యం చూడదగినది’ అంటూ రాసుకొచ్చాడు. ‘ఎలుక నిజంగా పాము పరిస్థితిని చెడగొట్టింది’ అంటూ కామెంట్ పంచుకున్నాడు.

మరిన్ని ఇంట్రస్టింగ్ వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Read: Viral Video: నిమ్మకాయ ధర కొండెక్కితే రియాక్షన్‌ ఇట్లే ఉంటుంది.. నవ్వులు పూయిస్తోన్న వైరల్‌ వీడియో..

Viral photo: ఇక్కడ తోపులెవరమ్మా..! ఈ ఫోటోలో ఉడుతను కనిపెట్టండి చూద్దాం.. క్లూస్ లేవ్