Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్టోర్‌ రూమ్‌లో వింత శబ్దాలు.. అక్కడి సీన్‌ చూసి అంతా షాక్‌ !!

స్టోర్‌ రూమ్‌లో వింత శబ్దాలు.. అక్కడి సీన్‌ చూసి అంతా షాక్‌ !!

Phani CH

|

Updated on: Oct 28, 2023 | 9:56 AM

సాధారణంగా ఇంట్లో ఉపయోగపడని పాత వస్తువులను స్టోర్‌రూమ్‌లో భద్రపరుస్తారు. అవసరమైనప్పుడు వాటిని తీసి తిరిగి ఉపయోగిస్తుంటారు. ఈ స్టోర్‌ రూమ్‌ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఇదుగో ఇలాంటివి దర్శనమిస్తుంటాయి. ఊహించని ప్రమాదాలు తెచ్చిపెడుతుంటాయి. తాజాగా ఓ ఇంట్లోని సందులాంటి ప్రాంతంలో పాత సామాన్లు కొన్ని స్టోర్‌ చేసి పెట్టారు. అక్కడినుంచి ఏవో శబ్దాలు రావడంతో యజమాని వెళ్లి చూశాడు.

సాధారణంగా ఇంట్లో ఉపయోగపడని పాత వస్తువులను స్టోర్‌రూమ్‌లో భద్రపరుస్తారు. అవసరమైనప్పుడు వాటిని తీసి తిరిగి ఉపయోగిస్తుంటారు. ఈ స్టోర్‌ రూమ్‌ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఇదుగో ఇలాంటివి దర్శనమిస్తుంటాయి. ఊహించని ప్రమాదాలు తెచ్చిపెడుతుంటాయి. తాజాగా ఓ ఇంట్లోని సందులాంటి ప్రాంతంలో పాత సామాన్లు కొన్ని స్టోర్‌ చేసి పెట్టారు. అక్కడినుంచి ఏవో శబ్దాలు రావడంతో యజమాని వెళ్లి చూశాడు. అంతే ఒక్కసారిగా ఎగిరి గంతేసి ఇవతలికి వచ్చేశాడు. ఎందుకంటే అక్కడ ఓ నాగుపాము పడగవిప్పి ఎవరికోసమో కాపుకాస్తున్నటటు గుర్రుమంటూ చూస్తోంది. వెంటనే స్థానికుల సహాయంతో స్నేక్‌ క్యాచర్‌కి సమాచారమిచ్చాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం ఉట్లపల్లి గ్రామంలోని ఒక ఇంటిలో నాగుపాము ప్రవేశించింది. దానిని గమనించి భయపడిన ఇంటియజమాని స్థానికులకు చెప్పడంతో వారు పాములు పట్టు వ్యక్తికి సమాచారమిచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న స్నేక్‌ క్యాచర్‌ పామును పట్టే పనిలో పడ్డాడు. అయితే నన్ను పట్టుకోవడం అంత ఈజీకాదు అన్నట్టు ముప్పు తిప్పలు పెట్టింది. చివరికి పామును బంధించి సురక్షితంగా అటవీ ప్రాంతంలో వదిలిపెట్టాడు స్నేక్‌ క్యాచర్‌. దాంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Viral Video: ఛత్తీస్ గఢ్‌లో గాల్లో ఎగిరిన హనుమంతుడు.. నెట్టింట వైరల్‌

గ్రీన్‌కార్డు దరఖాస్తుదారులకు ఎంప్లాయ్‌మెంట్‌ ఆథరైజేషన్‌ కార్డు

హెలికాఫ్టర్‌ నుంచి డాలర్ల వర్షం.. ఏరుకోవడానికి ఎగబడ్డ జనం..

Salaar: అప్పుడే 175 కోట్ల కలెక్షన్స్‌.. కళ్లుతిరిగేలా చేస్తున్న సలార్ క్రేజ్‌

Sitara Ghattamaneni: సీతూపాప లెహంగా ధరతో… ఏకంగా చిన్న బట్టలకొట్టే పెట్టేయొచ్చు