Hyderabad: పాతబస్తీలో అర్థరాత్రి గన్‌తో ఎస్ఐ హల్‌చల్..! గన్‌తో బెదిరించిన కారు ఆపిన ఎస్ఐ..

Updated on: Jan 06, 2023 | 6:18 PM

హైదరాబాద్ పాతబస్తీ నడిరోడ్డుపై విధి నిర్వహణలో ఉన్న ఓ ఎస్ఐ గన్‌తో హల్‌చల్​ చేశాడు. తెల్లవారుజామున వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు పోలీసులు.


హైదరాబాద్ పాతబస్తీ నడిరోడ్డుపై విధి నిర్వహణలో ఉన్న ఓ ఎస్ఐ గన్‌తో హల్‌చల్​ చేశాడు. తెల్లవారుజామున వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు పోలీసులు. అదే సమయంలో ఓపెన్ టాప్ కారులో వచ్చిన వ్యక్తులు ఆపకుండా పారిపోయేందుకు యత్నించారు. దీంతో విధి నిర్వహణలో ఉన్న ఎస్ఐ గన్‌తో బెదిరించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కాగా.. ఇది చూసిన నెటిజన్లు ”ఇదేనా ఫ్రెండ్లీ పోలీస్ అంటూ విమర్శిస్తున్నారు”. ఈ ఘటన పాతబస్తీ మీర్​చౌక్​పోలీస్ స్టేషన్​పరిధిలో తీవ్ర కలకలం రేపుతోంది. మీర్​చౌక్​ఎస్ఐ జబ్బార్​తన బృందంతో కలిసి అర్థరాత్రి మీర్​చౌక్‌లో వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నాడు. అటుగా వచ్చిన ఓపెన్​ టాప్​కారులో ఐదుగురు వ్యక్తులు వస్తుండటాన్ని గమనించిన కానిస్టేబుల్ ఆపే ప్రయత్నం చేశాడు. కారును ఆపకుండా వేగం పెంచడంతో కోపోద్రిక్తుడైన ఎస్ఐ జబ్బార్​తన వద్ద ఉన్న గన్ తీసి వారిని కిందకి దిగాలంటూ గట్టిగా కేకలు వేశాడు. దీంతో తీవ్ర భయాందోళనకు గురై కారును నడుపుతున్న వ్యక్తి పక్కకు ఆపాడు. గన్ చేతిలో పట్టుకుని అందరిని కిందకి దిగాలని సూచించాడు. దీంతో అందరూ కిందికి దిగడంతో డ్రైవర్​ సీటుతో పాటు వెనుక డిక్కీని క్షుణ్ణంగా పరిశీలించారు. కాగా.. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్​మీడియాలో వైరల్ అవుతోంది. సోషల్​ మీడియా ద్వారా విషయం తెలుసుకున్న సౌత్ జోన్ డీసీపీ సాయి చైతన్య ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారిస్తున్నట్లు తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Crocodile-drone: అబ్భాబ్భా ఎం వీడియో గురు.. తనను క్యాప్చర్‌ చేస్తున్న డ్రోన్‌ను మొసలి ఏం చేసిందో చూస్తే..

School childrens: స్కూల్‌ పిల్లల్లోకి ఆత్మలు.. తాంత్రికుడిని పిలిచి పూజలు నిర్వహణ.. ఎవరో తెలిస్తే షాకే.!

Car accident: డ్రైవర్‌ ర్యాష్‌ డ్రైవింగ్‌.. ప్రశ్నించినందుకు కారుతో ఢీకొట్టి.. నడిరోడ్డుపై దారుణంగా.. వీడియో.

Published on: Jan 06, 2023 06:11 PM
Loading...
Unable to load recommendations.
Follow Us