Band aid: వామ్మో.. బ్యాండ్ ఎయిడ్ అంత డేంజరా.? అధ్యయనంలో షాకింగ్ విషయాలు.
మనకు ఏవైనా చిన్న చిన్న గాయాలైనప్పుడు వెంటనే ఓ బ్యాండ్ ఎయిడ్ కొని అతికించడం అలవాటు. అయితే ఇది చాలా ప్రమాదకరమని తాజా అధ్యయనంలో తేలింది. బ్యాండ్ ఎయిడ్ క్యాన్సర్ కారకమంటూ తాజా అధ్యయనం ఒకటి షాకింగ్ విషయాలు వెల్లడించింది. PFAS గా పిలిచే పాలీ ఫ్లూరో ఆల్కైల్ సబ్‌స్టాన్సెస్ (Poly fluoro alkyl substances) ను బ్యాండ్ ఎయిడ్‌లో గుర్తించినట్టు కన్జుమర్ వాచ్‌డాగ్ మమవేషన్ పేర్కొంది.
మనకు ఏవైనా చిన్న చిన్న గాయాలైనప్పుడు వెంటనే ఓ బ్యాండ్ ఎయిడ్ కొని అతికించడం అలవాటు. అయితే ఇది చాలా ప్రమాదకరమని తాజా అధ్యయనంలో తేలింది. బ్యాండ్ ఎయిడ్ క్యాన్సర్ కారకమంటూ తాజా అధ్యయనం ఒకటి షాకింగ్ విషయాలు వెల్లడించింది. PFAS గా పిలిచే పాలీ ఫ్లూరో ఆల్కైల్ సబ్‌స్టాన్సెస్ (Poly fluoro alkyl substances) ను బ్యాండ్ ఎయిడ్‌లో గుర్తించినట్టు కన్జుమర్ వాచ్‌డాగ్ మమవేషన్ పేర్కొంది. వాతావరణంలో కరగని PFAS వంటి రసాయనాలతో ఆరోగ్య సమస్యలు పొంచి ఉన్నట్టు తెలిపింది. ఈ రసాయనాలు కలిగిన బ్యాండేజీలను గాయాలపై అతికించినప్పుడు అవి మెల్లగా శరీరంలో చేరి కరిగిపోకుండా ఏళ్లపాటు అలానే ఉంటాయని తెలిపింది. తద్వారా ఆరోగ్య సమస్యలకు కారణమవుతాయని వివరించింది. PFAS రసాయనాలు శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను, ఇన్ఫెక్షన్లతో పోరాడే సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయని, అంతేకాకుండా, టీకాల ఫలితాలను కూడా తగ్గిస్తాయని పరిశోధకులు పేర్కొన్నారు. పిల్లల గ్రహణశక్తి, శారీరక, మానసిక వికాశంపైనా ప్రభావం చూపిస్తాయని తెలిపారు. హార్మోనల్ సమస్యలతోపాటు కొన్ని రకాల కేన్సర్లు కూడా వచ్చే అవకాశం ఉందని వివరించారు. PFAS రసాయనాలకు వాటర్‌ప్రూఫ్ లక్షణాలు ఉండడం, వేడి, గ్రీజు, ఆయిల్, నీరు వంటి వాటిని తట్టుకునే శక్తి ఉండడంతో వీటిని బ్యాండేజ్‌లలో వాడతారు. అడెహెసివ్స్, నాన్‌స్టిక్ కుక్‌వేర్, ఫుడ్ ప్యాకేజింగ్‌లలోనూ ఈ రసాయనాలు కనిపిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా 18 బ్రాండ్లకు చెందిన 40 బ్యాండేజీలను పరిశీలించగా వాటిలో 26 బ్యాండేజీల్లో ఈ రసాయనాలు కనిపించినట్టు అధ్యయనం పేర్కొంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.