బిచ్చగాడి ఆస్తి చూసి అంతా షాక్‌ !! ఇనప్పెట్టె విప్పితే నోట్ల కట్టలు..

Updated on: Feb 23, 2026 | 8:43 PM

హర్యానాలోని అంబాలాలో చిరిగిన దుస్తులతో భిక్షాటన చేసే వృద్ధుడు లేఖరాజ్ మరణానంతరం అతని గుప్త సంపద వెలుగులోకి వచ్చింది. పదేళ్లుగా హనుమాన్ ఆలయం వద్ద భిక్షాటన చేస్తూ జీవనం సాగించిన ఇతను, కనీస వసతులు లేనట్టు కనిపించాడు. అతని మరణం తర్వాత పోలీసులు తనిఖీ చేయగా, అతని ఇనప్పెట్టెలో నగదు, బ్యాంకు ఖాతాలో కలిపి సుమారు రూ. 4 లక్షల సంపద బయటపడి అందరినీ ఆశ్చర్యపరిచింది. అతని పొదుపు విధానాన్ని ఇది సూచిస్తుంది.

హర్యానాలోని అంబాలా నగరంలో చిరిగిన దుస్తులు, పాత మూడు చక్రాల సైకిల్‌తో నిత్యం భిక్షాటన చేస్తూ కనిపించే ఒక వృద్ధుడి దగ్గర లక్షలాది రూపాయల సంపద బయటపడటంతో అధికారులు షాకయ్యారు. హనుమాన్ ఆలయం వద్ద గత పదేళ్లుగా లేఖరాజ్ భిక్షాటన చేస్తున్నాడు. అక్కడున్న వారందరికీ దాదాపుగా లేఖరాజ్ తెలుసు. అయితే ఎప్పుడూ నీరసించిన ముఖం, మాసిన బట్టలతో కనిపించే అతడు తన మూడు చక్రాల సైకిల్‌పైనే తిరిగేవాడు. భక్తులు, ప్రయాణికులు ఇచ్చే చిల్లరతోనే జీవనం సాగించేవాడు. అయితే ఆయన సైకిల్ వెనుక ఎప్పుడూ ఒక చిన్న పాత ఇనుప ట్రంకు పెట్టె కట్టేసి ఉండేది. అందులో ఏముందో ఎవరికీ తెలియదు. కానీ ఆ పెట్టే ఇప్పుడు అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇటీవల లేఖరాజ్ తీవ్ర అనారోగ్యంతో బాధపడ్డాడు. విషయం గుర్తించిన సామాజిక సంస్థ ప్రతినిధులు ఫిబ్రవరి 9న లేఖరాజ్‌ను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే చికిత్స పొందుతూ మూడు రోజుల తర్వాత ఆయన మృతి చెందారు. వృద్ధుడికి ఎవరూ లేకపోవడంతో ఆ సంస్థ సభ్యులే మానవత్వంతో అంత్యక్రియలు నిర్వహించారు. మరణానంతరం పోలీసులు అతని సామాన్లను చెక్‌ చేయగా.. లేఖరాజ్ కూడబెట్టిన సొమ్ము బయటపడింది. అతను దాచుకున్న ఇనప్పెట్టెను తెరిచి చూడగా.. అందులో రూ. 50,000 రూపాయలు విలువ చేసే 500 నోట్ల కట్ట బయటపడింది. దానికి బ్యాంక్ ఆఫ్ ఇండియా సీల్‌ ఉంది. అదే బ్యాంకు పాస్‌బుక్‌ చూడగా అతని ఖాతాలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ. 3,32,000 క్యాష్‌ జమ అయి అయినట్లు తెలిసింది. మరో రూ. 16 వేలు విడి నోట్ల రూపంలో ఉన్నాయి. ఒక సామాన్య యాచకుడు లేఖరాజ్ కు 4 లక్షల రూపాయల ఆస్తి ఉందని తెలిసి అధికారులు ఆశ్చర్యపోయారు. భిక్షాటన ద్వారా వచ్చిన ప్రతి పైసాను ఆయన వృథా చేయకుండా ఇలా కూడబెట్టి ఉంటాడని పోలీసులు చెబుతున్నారు. అయితే ఈ డబ్బును ఏం చేయబోతున్నారన్నది మాత్రం ఇంకా తెలియరాలేదు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఏ బిడ్డా.. ఇది నా అడ్డా.. కవ్వాల్‌ అభయారణ్యంలో అడవి దున్న

ప్రపంచ రికార్డు సృష్టించిన అత్యంత పెద్ద నత్త ను చూసారా ??

అసలు ఆమె త‌ల్లేనా ?? తాగిన మత్తులో 12 ఏళ్ల‌ కొడుక్కి వింత‌ శిక్ష‌

నగరాభివృద్ధికి 21 కేజీల బంగారాన్ని విరాళంగా ఇచ్చిన దాత

Gold Price Today: మళ్లీ దూసుకెళ్తున్న బంగారం, వెండి ధరలు!

Loading...
Unable to load recommendations.
Follow Us