సీమా హైదర్‌పై ఆమె పాకిస్థానీ భర్త ఆగ్రహం
ప్రియుడు సచిన్ మీనా కోసం నలుగురు పిల్లలతో సహా భారత్‌కు వచ్చిన పాకిస్థానీ మహిళ సీమా హైదర్‌పై ఆమె భర్త గులామ్ హైదర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన భార్యను, పిల్లలను తిరిగి వెనక్కి పంపాలని ఆమె పాకిస్తాన్ భర్త గులామ్ హైదర్ సోషల్ మీడియా ద్వారా భారత ప్రభుత్వాన్ని కోరుతున్నాడు. ఆమె తనను మోసం చేసి, తన ఆస్తులను అమ్ముకుని పారిపోయిందని ఆరోపిస్తున్నాడు. భార్య దేశం విడిచి పోయినప్పటి నుంచి గులాం హైదర్ సొంతంగా యూట్యూబ్ ఛానెల్ పెట్టుకుని తన ఆవేదనను వెలిబుచ్చుతున్నాడు.
ప్రియుడు సచిన్ మీనా కోసం నలుగురు పిల్లలతో సహా భారత్‌కు వచ్చిన పాకిస్థానీ మహిళ సీమా హైదర్‌పై ఆమె భర్త గులామ్ హైదర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన భార్యను, పిల్లలను తిరిగి వెనక్కి పంపాలని ఆమె పాకిస్తాన్ భర్త గులామ్ హైదర్ సోషల్ మీడియా ద్వారా భారత ప్రభుత్వాన్ని కోరుతున్నాడు. ఆమె తనను మోసం చేసి, తన ఆస్తులను అమ్ముకుని పారిపోయిందని ఆరోపిస్తున్నాడు. భార్య దేశం విడిచి పోయినప్పటి నుంచి గులాం హైదర్ సొంతంగా యూట్యూబ్ ఛానెల్ పెట్టుకుని తన ఆవేదనను వెలిబుచ్చుతున్నాడు.. ఈ మేరకు పలు వీడియోలు చేసి యూట్యూబ్‌లో పోస్టు చేస్తున్నాడు. ఇటీవల గులాం హైదర్‌కు సంబంధించిన మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో తన భార్యను, పిల్లలను వెనక్కి పంపించాలని అతను మరోమారు విజ్ఞప్తి చేస్తున్న దృశ్యాలు ఉన్నాయి. అదేవిధంగా సీమా హైదర్ తరపు న్యాయవాదులు ఏపీ సింగ్, నేత్రపాల్‌ను హెచ్చరిస్తున్న దృశ్యాలు కూడా వీడియోలో కనిపిస్తున్నాయి. వీలైనంత త్వరలో తాను పాకిస్థాన్ నుంచి భారత్‌కు వెళ్తానని కూడా గులామ్ హైదర్ ఆ వీడియోలో వెల్లడించాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పప్పుతో గ్యాస్ ట్రబులా.. అయితే ఇలా చేయండి
ఇక్కడ పోస్ట్ ఆఫీసు రాత్రి వేళ కూడా పని చేస్తుంది
అయ్యప్ప భక్తులకు స్పాట్ బుకింగ్ రద్దు