బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి

Updated on: Aug 19, 2026 | 2:05 PM

బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో దొంగల దృష్టి బంగారు షాపులపై పడింది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లోని ఓ జువెలరీ షాపులో బురఖాలు ధరించి వచ్చిన నలుగురు మహిళలు రూ. 10 లక్షల విలువైన బంగారు ఆభరణాలతో పలాయనం చిత్తగించారు. సిబ్బందిని మాటల్లో పెట్టి, చాకచక్యంగా నగలు కాజేశారు.

బంగారం ధరలు అమాంతం పెరిగిపోవడంతో దొంగల దృష్టి ఇప్పుడు బంగారు షాపులపై పడింది. సులువుగా డబ్బు సంపాదించేందుకు ఇళ్లు, దుకాణాలు అని తేడా లేకుండా రకరకాల చోరీలకు పాల్పడుతున్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లాలో ఓ విస్మయకరమైన బంగారం చోరీ ఘటన వెలుగులోకి వచ్చింది. బురఖాలు ధరించి వచ్చిన కొందరు మహిళలు ఏకంగా పది లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలతో ఉడాయించారు. జహీరాబాద్‌లోని ఒక జువెలరీ షాపులో ఈ భారీ చోరీ జరిగింది. ఇటీవల సాయంత్రం నాలుగు గంటల సమయంలో నలుగురు మహిళలు, వారి వెంట ఒక యువకుడు బురఖాలు ధరించి షాపులోకి ప్రవేశించారు. ముక్కుపుడకలు కావాలని చెప్పి సేల్స్‌మెన్, షాపు యజమానిని మాటల్లో పెట్టారు. వారికి రకరకాల డిజైన్లు చూపించడంలో సిబ్బంది నిమగ్నమైనప్పుడు, ఆ ముఠాలోని ఒక మహిళ దృష్టి మరల్చగా, మరో మహిళ అత్యంత చాకచక్యంగా కౌంటర్‌లో ఉన్న బంగారు నగల పెట్టెను కాజేసింది. నగల పెట్టె చేతికి చిక్కగానే, ముక్కుపుడకలు తమకు నచ్చలేదని చెప్పి ఆ బృందం షాపు నుండి బయటపడింది.

మరిన్ని వీడియోల కోసం :

గ్లోబల్‌ బిజినెస్‌ లెక్కలు మార్చేస్తున్న రామాయణ టీమ్‌

ఫరియా అబ్దుల్లాను ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు

ఆగస్టు మీద ఐకాన్‌ స్టార్‌ ఫ్యాన్స్ ఆశలు

అజిత్ సినిమాలో గెస్ట్ రోల్స్‌లో వెంకటేష్‌, మోహన్‌లాల్‌

Published on: Aug 19, 2026 02:02 PM
Loading...
Unable to load recommendations.
Follow Us