మూడు గుడ్లకు రూ.500! బిల్లు చూసి షాకైన గెస్ట్, వైరల్ వీడియో

Updated on: Jun 09, 2026 | 5:57 PM

ముంబైలోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌లో మూడు ఉడికించిన గుడ్లు, పరాఠా, పెరుగు, మిల్క్‌షేక్‌కు రూ.2,300 బిల్లు రావడంతో ఓ అతిథి సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేశాడు. ముఖ్యంగా మూడు గుడ్లకే దాదాపు రూ.500 వసూలు చేయడంపై నెటిజన్ల మధ్య తీవ్ర చర్చ జరిగింది. కొందరు హోటల్ ధరలను తప్పుబట్టగా, మరికొందరు ప్రీమియం సేవలకు ఇవి సహజమేనని అభిప్రాయపడ్డారు.

ముంబైలోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌లో బస చేసిన గెస్ట్‌కు ఎదురైన అనుభవం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. ఆర్డర్ చేసిన ఒక పరాఠా, మూడు ఉడికించిన గుడ్లు, పెరుగు, మిల్క్‌షేక్‌కు ఏకంగా రూ. 2,300 బిల్లు రావడంతో ఆశ్చర్యపోయాడు. కేవలం మూడు గుడ్లకు రూ. 499 ప్లస్ ట్యాక్సులు వసూలు చేయడాన్ని నిరసిస్తూ పోస్ట్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ముంబైలోని హిల్టన్ హోటల్‌లో బస చేశాడు. రాత్రి డిన్నర్ కోసం రూమ్ సర్వీస్‌లో కొన్ని సాధారణ ఐటమ్స్ ఆర్డర్ చేశాడు. వచ్చిన బిల్లు చూసి షాకయ్యాడు. తను ఆర్డర్ చేసింది పెద్ద ఫ్యాన్సీ డిష్ ఏమీ కాదనీ కేవలం ఆలూ పరాఠా, కొన్ని ఉడికించిన గుడ్లు, పెరుగు, వనిల్లా మిల్క్‌షేక్ అనీ చెప్పుకొచ్చాడు. కానీ దానికి బిల్లు రూ. 2,300 వచ్చిందనీ అంటే మూడు గుడ్ల ధర దాదాపు రూ. 500 రూపాయలనీ ఆవేదన వ్యక్తం చేస్తూ ‘వాట్ ది హెల్’ అనే టైటిల్‌తో వీడియోను పంచుకున్నాడు. ఫైవ్‌స్టార్ హోటళ్లలో మౌలిక సదుపాయాల కారణంగా ధరలు ఎక్కువగా ఉంటాయని తనకు తెలుసని, కానీ ఆ స్థాయిలో ఉండటం సరైంది కాదని అతను అభిప్రాయపడ్డాడు. “బయట రూ. 10-12 పలికే ఒక్కో గుడ్డుకు ఇక్కడ సుమారు రూ. 160-170 చొప్పున వసూలు చేశారన్నాడు. మార్కప్ వేసినా 4 లేదా 5 రెట్లు వేయాలి కానీ, ఈ స్థాయిలో ఉండటం చాలా అసంబద్ధం అని అన్నాడు. వీడియో పోస్ట్ చేసిన కొద్దిసేపటికే వైరల్ అయింది. దీనికి 2.2 లక్షలకు పైగా వ్యూస్ రాగా, నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. కొందరు గెస్ట్‌కు మద్దతుగా నిలిస్తే, మరికొందరు హోటల్‌ను సమర్థించారు. “గుడ్ల సంగతి పక్కనపెడితే, ఒక్క పరాఠాకు రూ. 1100 వసూలు చేయడం మరింత దారుణం” అని ఒక యూజర్ కామెంట్ చేయగా, “అంతర్జాతీయ పర్యాటకులకు ఈ ధర 20-25 డాలర్లతో సమానం, అది పెద్ద విషయం కాదు” అని మరొకరు అభిప్రాయపడ్డారు. మరికొందరు నెటిజన్లు గెస్ట్‌నే తప్పుబట్టారు. “రూమ్ డైనింగ్ సర్వీస్‌కు అదనపు ఛార్జీలు ఉంటాయి. ఫైవ్‌స్టార్ హోటల్‌లో దాబా రేట్లు ఆశించకూడదు” అని ఒకరు చురక అంటించారు. “గుడ్ల ధర రూ. 50 అయితే, వాటిని మీ బెడ్ వద్దకు డెలివరీ చేసినందుకు సర్వీస్ ఛార్జ్ రూ. 450. ఎయిర్‌పోర్ట్ కాఫీ ధరను ఇంటి కాఫీతో పోల్చడం లాంటిదే ఇది” అని మరో యూజర్ కామెంట్ చేశారు. మొత్తంగా ఈ ఘటనతో ప్రీమియం హోటళ్లలో ధరల విధానంపై మరోసారి చర్చ మొదలైంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆటో డ్రైవర్ కు UPI ద్వారా.. రూ.15,682 పంపిన ప్రయాణికుడు.. ఆ తర్వాతే అసలు ట్విస్ట్‌!

భార్యాపిల్లలు ఇంట్లో ఉండగానే.. జేసీబీతో వచ్చి.. ఇంటిని కూల్చేసిన భర్త

ఐఫోన్‌ కావాలన్న ప్రియురాలు.. మైనర్‌ ఏం చోరీ చేసాడంటే..

ఎవరెస్ట్‌పై అద్భుతం..ఆరు రోజులు ఆహారం, ఆక్సిజన్ లేకున్నా బతికాడు!

బాస్ అంటే ఇతడే.. కంటతడి పెట్టిస్తున్న ఘటన!

Follow Us