Rat In Food: లవ్లీ యూనివర్శిటీ మెస్‌లో దారుణం.. విద్యార్ధులు తినే భోజనంలో ఎలుక.లైట్ తీసుకోండి అన్న యాజమాన్యం..

Updated on: Nov 23, 2022 | 9:51 AM

యూనివర్సిటీలలో చదువులంటే విద్యార్థులతో సహా వారి తల్లిదండ్రులకు కూడా ఎన్నో ఊహలు ఉంటాయి. అక్కడ విద్యార్థులు అన్ని రకాల వసతులతో సహా ప్రశాంత వాతావరణంలో విద్యనభ్యసిస్తారని అందరూ భావిస్తుంటారు.


యూనివర్సిటీలలో చదువులంటే విద్యార్థులతో సహా వారి తల్లిదండ్రులకు కూడా ఎన్నో ఊహలు ఉంటాయి. అక్కడ విద్యార్థులు అన్ని రకాల వసతులతో సహా ప్రశాంత వాతావరణంలో విద్యనభ్యసిస్తారని అందరూ భావిస్తుంటారు. కానీ చండీఘడ్‌ లోని ఓ యూనివర్సిటీలోమాత్రం ఇందుకు విరుద్ధంగా ఉంది. యూనివర్సిటీ మెస్‌ నిర్వాహకులు విద్యార్ధుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. విద్యార్థులు తినే పప్పులో ఓ ఎలుక రావడంతో అంతా షాకయ్యారు. దీనిపై మెస్ నిర్వాహకులను ప్రశ్నించగా..‘ఇది చాలా సాధారణమైన విషయం’ అని సమాధానమిచ్చారు. మెస్ నిర్వాహాకులపై వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. చండీఘడ్‌లోని లవ్లీ యూనివర్సిటీలో నవంబరు 18 రాత్రి విద్యార్థులు భోజనం చేసే సమయంలో ఈ దారుణం జరిగింది.దీంతో హాస్టల్ విద్యార్థులంతా కలిసి నిరసన చేపట్టారు. నిర్లక్షంగా సమాధానమిచ్చిన మెస్ నిర్వాహకులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. కాగా ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ అయిన యూనివర్సిటీలో లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ కూడా ఒకటి. ఈ యూనివర్సిటీకి తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది విద్యార్థులు వెళ్లి చదువుకుంటున్నారు . అయితే అన్ని విధాలుగా మంచి పేరు తెచ్చుకున్న ఈ యూనివర్సిటీ విద్యార్ధులకు మాత్రం మెరుగైన భోజన సదుపాయాలను అందించడంలో విఫలమైంది. విషయాన్ని తెలుసుకున్న తల్లిదండ్రులు.. ఇప్పటికైనా యూనివర్సిటీ అధికారులు విద్యార్థుల గురించి ఆలోచించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Dog saved cat: పిల్లిపిల్లను కాపాడేందుకు కుక్క ప్లాన్‌ అదుర్స్‌..! కుక్కపై ప్రశంసలు.. వైరల్‌ అవుతున్న క్యూట్‌ వీడియో.

David Warner As Dj Tillu: డీజే టిల్లు గెటప్‌లో అదరగొట్టిన డేవిడ్‌ వార్నర్‌.. అదరహో అనిపించేలా వార్నర్‌ న్యూలుక్‌..

Alien Birth: బీహార్‌లో వింత శిశువు.. గ్రహాంతరవాసి జననం..? వీడియో చూసి తెగ షేర్ చేస్తున్న నెటిజన్స్..

Loading...
Unable to load recommendations.
Follow Us